Ponniyin Selvan2 Trailer: పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే

ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.

Ponniyin Selvan2 Trailer: పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే
Ponniyin Selvan 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2023 | 6:30 PM

మణిరత్నం సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నిజానికి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.

కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా.. సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రచించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ 2 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మణిరత్నం. ఈ సినిమా ట్రైలర్ డేట్ నుంచి అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విక్రమ్, ఐశ్వర్య రాయ్ లతో డిజైన్ చేశారు. తాజాగా ఐశ్వర్య ఈ పోస్టర్ ను షేర్ చేశారు.