Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: నాగార్జున ‘సంతోషం’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? సినిమాలకు దూరంగా ఉంటూ ఇప్పుడేం చేస్తోందంటే?

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో సంతోషం ఒకటి. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియాతో పాటు గ్రేసీ సింగ్‌ కథానాయికగా కనిపించింది. సినిమాలో ఆమె ఉండేది కాసేపే అయినా తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుందీ అందాల తార.

Actress: నాగార్జున 'సంతోషం' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? సినిమాలకు దూరంగా ఉంటూ ఇప్పుడేం చేస్తోందంటే?
Gracy Singh, Nagarjuna
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2023 | 5:42 PM

కొందరు హీరోయిన్లు పెద్దగా సినిమాలు చేయరు. ఒకటి లేదా రెండు సినిమాలతోనే సరిపెడతారు. నాగార్జున గీతాంజలి హీరోయిన్‌ గిరిజా మొదలు ఇలాంటి ‘వన్‌ ఫిల్మ్‌ వండర్‌’ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఈ కోవలోకే వస్తోంది అందాల తార గ్రేసీ సింగ్‌. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో సంతోషం ఒకటి. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియాతో పాటు గ్రేసీ సింగ్‌ కథానాయికగా కనిపించింది. సినిమాలో ఆమె ఉండేది కాసేపే అయినా తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుందీ అందాల తార. ముఖ్యంగా ఆ సినిమాలో గ్రేసీ సింగ్‌ కనిపించే ‘దేవుడే దిగివచ్చినా.. తాజ్‌ మహల్‌ నాకిచ్చానా’ అనే పాట చాలా ఫేమస్‌. ఈ సినిమాలో ఆమె అభినయాన్ని చూసి మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. ఈ సినిమా తర్వాత మోహన్‌బాబు, శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన తప్పుచేసి పప్పు కూడులో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఇదే ఆమెకు ఆఖరి సినిమా. అయితే హిందీతో పాటు తమిళ్‌, మలయాళం, పంజాబీ తదితర భాషల్లో సినిమా ఛాన్సులు రావడంతో టాలీవుడ్‌కి దూరమైపోయిందీ అమ్మడు.

హిందీలో ఆమిర్‌ఖాన్‌ లగాన్‌, గంగాజల్‌, మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించింది గ్రేసీసింగ్‌. ఆ తర్వాత చాలాకాలానికి రామ రామ కృష్ణ కృష్ణ అనే తెలుగు సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సరసన ఓ కీలక పాత్రలో కనిపించింది. కాగా ఆమె చివరిసారిగా 2015లో ఓ పంజాబీ సినిమాలో కనిపించింది. ఆతర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌కు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న ఆమె పెళ్లి కూడా చేసుకోలేదట. అయితే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్‌ అయిన గ్రేసీ సింగ్‌ తన పేరిట ‘గ్రేసీ సింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’ని ప్రారంభించిందట. దేశ, విదేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తోందట. అలాగే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ వారి సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదీ ముద్దుగుమ్మ. పండగలు, పర్వదినాల్లో మాత్రమే తన ఫొటోలు పంచుకుంటోంది. అలా ఇటీవల ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అందులో చాలా మారిపోయి చాలా బొద్దుగా కనిపించింది. వీటిని చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..