Ravanasura Trailer: అదరగొట్టిన మాస్ మహారాజ్.. నెక్స్ట్ లెవల్‌లో రావణాసుర ట్రైలర్

ఈ మూవీ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సైతం సూపర్ హిట్ అందుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ భారీ విజయాలను అందుకుని ఫుల్ జోష్‏లో ఉన్నారు మాస్ మాహారాజా. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Ravanasura Trailer: అదరగొట్టిన మాస్ మహారాజ్.. నెక్స్ట్ లెవల్‌లో రావణాసుర ట్రైలర్
Ravanasura
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2023 | 5:11 PM

మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రావణాసుర. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ మాహారాజా రవితేజ. ఈ మూవీ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సైతం సూపర్ హిట్ అందుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ భారీ విజయాలను అందుకుని ఫుల్ జోష్‏లో ఉన్నారు మాస్ మాహారాజా. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రావణాసుర ఒకటి. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమపై ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఆ క్రమంలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా రావణాసుర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా క్రియేట్ చేశారు దర్శకుడు సుధీర్ వర్మ. అలాగే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లాయర్ అయిన క్రిమినల్ అంటూ జయరాం చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే.. అని రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్స్క్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమన్యూయేల్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.