MM Keeravani: ఆస్కార్‌ ఈవెంట్‌ తర్వాత పూర్తిగా బెడ్‌కే పరిమితమైన కీరవాణి!! కారణం అదేనా?

తన సంగీత ప్రతిభకు గుర్తుగా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు సొంతం చేసుకున్నారు కీరవాణి. ఇక ఇటీవల ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారంతో మరో మెట్టు పైకెక్కారు. ఆయన స్వరాలు సమకూర్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకుంది.

MM Keeravani: ఆస్కార్‌ ఈవెంట్‌ తర్వాత పూర్తిగా బెడ్‌కే పరిమితమైన కీరవాణి!! కారణం అదేనా?
Keeravani
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2023 | 4:15 PM

తన సంగీత ప్రతిభకు గుర్తుగా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు సొంతం చేసుకున్నారు కీరవాణి. ఇక ఇటీవల ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారంతో మరో మెట్టు పైకెక్కారు. ఆయన స్వరాలు సమకూర్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇదే పాటకు అద్భుతంగా సాహిత్యం అందించిన చంద్రబోస్‌తో కలిసి ఆస్కార్‌ వేదిక మీద ఈ అవార్డును అందుకున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్‌ ఈవెంట్‌ తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన పూర్తిగా బెడ్‌ రెస్ట్‌కే పరిమితమయ్యారట. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రయాణాలు చేయడంతో ఆయన బాగా అలసిపోయారట. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కొంచెం ఒంట్లో నలతగా అనిపించడంతో కీరవాణి కరోనా టెస్ట్ చేయించుకున్నారట. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందట. ఈ విషయాన్ని ఆయనే  ఒక నేషనల్‌ మీడియా సంస్థతో పంచుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారని ఇంట్లోనే ఉండి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్లు కీరవాణినే స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హిందీ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం నిజమేనా? కాదా? అనే విషయంపై సరైన క్లారిటీ లేదు. ఈ విషయంలో కీరవాణి కానీ ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇదిలా ఉంటే రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్‌బాబుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కునుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!