Bellamkonda Sai Sreenivas: ప్రపంచ రికార్డు సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. జయజానకి నాయక సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకోల్పొయింది.
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జయజానకి నాయక సినిమా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. జయజానకి నాయక సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకోల్పొయింది. 2017లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం బోయపాటి మార్క్ ఉంటుంది. ఇక ఈ సినిమా యూట్యూబ్ లో హిందీ వర్షన్ అందుబాటులో ఉంది. జయజానకి సినిమా హిందీ వర్షన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న ఈ సినిమా తాజాగా ప్రపంచ రికార్డు సాధించింది.
709 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో 709 కోట్ల వ్యూస్ వచ్చిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది జయజానకి నాయక. మన దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన హిందీ ఆడియన్స్ కు మాత్రం బాగా మెప్పించింది.ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ 702 కోట్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.