సినిమా భలే తీసినవ్‌ బ్రదర్‌.. ‘బలగం’ ను మరోసారి మెచ్చుకున్న మంత్రి కేటీఆర్‌.. డైరెక్టర్‌ వేణుకు ఆత్మీయ సత్కారం

తాజాగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వేణును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణును మంత్రి కేటీఆర్‌ ఆలింగనం చేసుకుని, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

సినిమా భలే తీసినవ్‌ బ్రదర్‌.. 'బలగం' ను మరోసారి మెచ్చుకున్న మంత్రి కేటీఆర్‌.. డైరెక్టర్‌ వేణుకు ఆత్మీయ సత్కారం
Ktr, Venu
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2023 | 3:41 PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నోట వినిపిస్తోన్న సినిమా బలగం. థియేటర్లలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో సినిమా చూసిన చాలామంది బలగంపై తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. కుటుంబ బంధాలు, బాంధవ్యాలను చాలా అద్భుతంగా చూపించారంటూ, సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నామంటూ బలగం యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డైరెక్టర్‌ వేణు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు బలగం యూనిట్‌ను మెచ్చుకున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ మరోసారి బలగం యూనిట్‌ను ప్రశంసించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ వేణును అభినందించారు. తాజాగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వేణును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణును మంత్రి కేటీఆర్‌ ఆలింగనం చేసుకుని, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని వేణును కేటీఆర్ అభినందించారు. సమాజానికి దోహదపడేలా బలగం లాంటి సినిమాలు మరిన్ని తీయాలని సూచించారు. కాగా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ ట్రెండింగ్‌ లిస్టు టాప్‌-2లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!