Chiranjeevi: బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి

మంగళవారం (మార్చి 28)తో బన్నీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఐకాన్‌ స్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడికి విషెస్‌ చెప్పారు.

Chiranjeevi: బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి
Chiranjeevi, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2023 | 1:52 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ హీరో అల్లు అర్జున్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. టాలీవుడ్‌ ఐకాన్‌ హీరో అల్లు అర్జున్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను ఆర్య, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠ పురంలో తదితర సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఇక 2021లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా సినిమా రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోన్నాడీ స్టైలిష్‌ స్టార్‌. కాగా మంగళవారం (మార్చి 28)తో బన్నీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఐకాన్‌ స్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడికి విషెస్‌ చెప్పారు. బన్నీ మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసున్న ఓ పాత ఫొటోను షేర్‌ చేసిన చిరంజీవి.. ‘డియర్‌ బన్నీ.. సినిమా పరిశ్రమలో నువ్వు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ చిన్ననాటి రోజులు నా మదిలో ఇంకా అలాగే మెదులుతున్నాయి. సమయం ఎంతో వేగంగా గడిచిపోయింది కదా! ఒక సాధారణ నటుడిగా అడుగుపెట్టి పాన్‌ ఇండియా స్టార్‌, ఐకాన్‌ స్టార్‌గా నువ్వు ఎదగడం చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో విజయాలు, ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి.

ఇక చిరంజీవి ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందించారు. ‘మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. నా మనసులో మీ మీద కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. థాంక్యూ చికబాబి’ అని బన్నీ రిప్లై ఇచ్చారు. ఇప్పుడే కాదు గతంలోనూ చిరంజీవిని చికబాబి అని సంబోధిస్తూ ట్వీట్లు చేశారు. బహుశా మామయ్యను బన్నీ ఆ విధంగా పిలుస్తారేమో మరి. కాగా చిరంజీవి నటించిన ‘విజేత’, ‘డాడీ’ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించారు అల్లు అర్జున్‌. అలాగే కమల్‌ హాసన్‌ క్లాసిక్‌ మూవీ స్వాతిముత్యలోనూ బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత స్టైలిష్‌ స్టార్‌గా, ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిపోయారు. ప్రస్తుతం ఆయన పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్