AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Singer: కిడ్నీ సమస్యలతో మంచాన పడ్డ ‘బలగం’ సింగర్‌.. అండగా ఉంటామన్న మంత్రి హరీశ్ రావు

బుర్రకథలతో పొట్ట నింపుకునే మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో క్రమం తప్పకుండా తన భర్తను వరంగల్‌కు తీసుకొచ్చి డయాలసిస్‌ చేయిస్తోంది భార్య కొమురమ్మ. చికిత్సకు తోడు ప్రయాణాల ఖర్చులకు తడిసి మోపడవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Balagam Singer: కిడ్నీ సమస్యలతో మంచాన పడ్డ 'బలగం' సింగర్‌.. అండగా ఉంటామన్న మంత్రి హరీశ్ రావు
Harish Rao
Basha Shek
|

Updated on: Apr 11, 2023 | 3:56 PM

Share

బలగం సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ‘తోడుగా మాతోడుండి’ అనే పాటను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ పాటకు తమ గొంతుతో ప్రాణం పోశారు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. సినిమా సంగతి పక్కన పెడితే.. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మొగిలయ్య దంపతులు. బుర్రకథలతో పొట్ట నింపుకునే మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో క్రమం తప్పకుండా తన భర్తను వరంగల్‌కు తీసుకొచ్చి డయాలసిస్‌ చేయిస్తోంది భార్య కొమురమ్మ. చికిత్సకు తోడు ప్రయాణాల ఖర్చులకు తడిసి మోపడవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో వీరి దీన స్థితిని గమనించిన బలగం డైరెక్టర్‌ వేణు రూ.లక్ష ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఇదిలా ఉంటే తాజాగా మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కదల్లేని స్థితిలో మంచాన పడ్డాడని తెలుస్తోంది. బీపీ, షుగర్‌ కూడా పెరగడంతో రెండు కళ్లు కూడా కనిపించడం లేదట.

కాగా మొగిలయ్య దీన స్థితి పై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. మొగిలయ్యకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్నిరకాల పరీక్షలు చేసి అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయనకు డయాలసిస్‌ సహా మెరుగైన వైద్యం అందించి, మందులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ కూడా మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారట. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేసి మొగిలయ్య హెల్త్‌ కండీషన్‌ గురించి తెలుసుకున్నారట. ఇంటికెళ్లి ధైర్యం చెప్పి రావాలని స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా సూచించారట. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!