Chiranjeevi: చంద్రబోస్‌ను సత్కరించిన మెగాస్టార్.. ‘ఆస్కార్‌ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమంటూ’..

ట్రిపులార్‌ భారతీయ సినిమాను ఓ మెట్టు పైకెక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షించి కేవలం కలెక్షపరంగానే కాకుండా అవార్డులతోనూ మెప్పించిందీ మూవీ. ఇక ఈ సినిమాలోని నాటా నాటు సాంగ్ ఎంతటి..

Chiranjeevi: చంద్రబోస్‌ను సత్కరించిన మెగాస్టార్.. 'ఆస్కార్‌ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమంటూ'..
Chiranjeevi
Follow us

|

Updated on: Mar 30, 2023 | 5:32 PM

ట్రిపులార్‌ భారతీయ సినిమాను ఓ మెట్టు పైకెక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షించి కేవలం కలెక్షపరంగానే కాకుండా అవార్డులతోనూ మెప్పించిందీ మూవీ. ఇక ఈ సినిమాలోని నాటా నాటు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని ఏకంగా ఆస్కార్‌ వేదికగా సగర్వంగా చాటింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆస్కార్‌ దక్కడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి రచయిత చంద్రబోస్‌ను ఘనంగా సత్కరించారు.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న భోళాశంకర్‌ సెట్‌లోకి చంద్రబోస్ ఆస్కార్ తో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా చిరు.. చంద్రబోస్‌కి శాలువా కప్పి చిరు సత్కారం చేశాడు. చంద్రబోస్‌ ఆస్కార్‌ని చిరుకి అందించగా గర్వంగా పైకెత్తారు చిరు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన చిరంజీవి తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ’95 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది’ అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

చిరు చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఏంటే మొన్నటి మొన్న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు వేడుకల్లో రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కార్తికేయలను కూడా చిరు సన్మానించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న భోలీ శంకర్‌ మూవీని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో