AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Ramya: అమ్మానాన్నల తర్వాత రాహుల్‌ గాంధీయే.. నటి రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రమ్యా అలియాస్‌ దివ్యా స్పందన.. పేరు చెబితే చాలామంది త్వరగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ సూర్య నటించిన 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' లోని 'నిదరే కల అయినదీ, కలయే నిజమైనది' పాటలో కనిపించిన హీరోయిన్‌ అంటే ఠక్కున గుర్తుపడతారు. ఆ సినిమాలో సూర్య పక్కన ఎంతో అందంగా కనిపించింది రమ్య.

Actress Ramya: అమ్మానాన్నల తర్వాత రాహుల్‌ గాంధీయే.. నటి రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rahul Gandhi, Ramya
Basha Shek
|

Updated on: Mar 30, 2023 | 1:07 PM

Share

రమ్యా అలియాస్‌ దివ్యా స్పందన.. పేరు చెబితే చాలామంది త్వరగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ లోని ‘నిదరే కల అయినదీ, కలయే నిజమైనది’ పాటలో కనిపించిన హీరోయిన్‌ అంటే ఠక్కున గుర్తుపడతారు. ఆ సినిమాలో సూర్య పక్కన ఎంతో అందంగా కనిపించింది రమ్య. అంతకుముందు కల్యాణ్‌ రామ్‌ సరసన అభిమన్యు సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ కన్నడలో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి అమృత వర్షం అనే మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలో కథానాయికగా కనిపించి మెప్పించింది. ఇలా కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది రమ్య. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య.. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య  జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంది.

‘నాకు నా అమ్మానాన్నలే ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. అయితే అప్పటికీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకేమీ తెలియదు. అంతా కొత్తగా ఉన్నప్పటికీ.. ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పని వైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. లైఫ్‌ లో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్‌ గాంధీనే ఉంటారు. ఓ వైపు నాన్న మరణం, మరోవైపు ఎన్నికల్లో ఓడిపోవడంతో బాగా నిరాశ చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్‌ గాంధీ నాకు అండగా నిలబడ్డారు. మానసికంగా ధైర్యమిచ్చారు’ అని చెప్పుకొచ్చింది రమ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..