Skincare: మీ ఆహారంలో ఈ 5 విటమిన్లు ఉంటే చాలు.. చర్మ సమస్యలకు, వృద్ధాప్యానికి చెక్ పెట్టినట్లే..

చర్మ సంరక్షణ కోసం కాస్మటిక్స్ కంటే తినే ఆహారమే ఉపయోగకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును, పండ్లు లేదా కూరగాయలలో లభించే కొన్ని రకాల..

Skincare: మీ ఆహారంలో ఈ 5 విటమిన్లు ఉంటే చాలు.. చర్మ సమస్యలకు, వృద్ధాప్యానికి చెక్ పెట్టినట్లే..
Skincare
Follow us

|

Updated on: Mar 31, 2023 | 10:12 AM

అందమైన చర్మాన్ని కోరుకోనివారు ఎవరుంటారు..? నలుగురిలో ఆకర్షణిీయంగా కనిపించాలనే కోరికతో.. చాలా మంది తన చర్మ సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నలుగురిలో అందంగా కనిపించాలంటే.. ముందుగా చర్మాన్ని రక్షించుకోవాలిగా..! ఈ నేపథ్యంలోనే చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో ఉన్న అన్ని రకాల కాస్మటిక్స్‌ని ఉపయోగిస్తారు. కానీ ఫలితం లేక నిరుత్సాహ పడిపోతుంటారు. అయితే చర్మ సంరక్షణ కోసం కాస్మటిక్స్ కంటే తినే ఆహారమే ఉపయోగకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును, పండ్లు లేదా కూరగాయలలో లభించే కొన్ని రకాల పోషకాలు మన చర్మాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తినే ఆహారపదార్థాలలో విటమిన్లు ఉండేలా చూసుకోవడం మరీ ముఖ్యం. విటమిన్లు మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడం ద్వారా చర్మాన్ని కాపాడుతాయి. మరి చర్మాన్ని కాపాడే విటమిన్లు ఏమిటో.. వాటితో ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Vitamin C: విటమిన్ సీ ఎక్కువగా శరీరంలో యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంలో, చర్మంపై గాయాలను నయం చేయడంలో కూడా విటమిన్ సీ ఉపకరిస్తుంది. అంతేకాక శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవడానికి కూడా ఈ విటమిన్ సహకరిస్తుంది.

Vitamin E: చర్మానికి మెరుపును, మృదుత్వాన్ని ఇవ్వడంలో విటమిన్ ఈ సహకరిస్తుంది. అలాగే వృద్ధాప్యం లక్షణాలను నెమ్మదింపజేస్తుంది. విటమిన్ సీ అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడమే కాక తామర వంటి ఇతర చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

Vitamin A: విటమిన్ ఏ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక మొటిమలను నివారించడంలో, వృద్ధాప్యాన్ని తగ్గించడంలో కూడా విటమిన్ ఏ సహాయపడుతుంది.

Vitamin B3: విటమిన్ బీ 3 హానికరమైన సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మిలోని UVA , UVB కిరణాలు చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి విటమిన్ బి 3 పుష్కలంగా ఉండే ఆహారాలను తింటే సరిపోతుంది.

Vitamin K: రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో విటమిన్ కే బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడానికి కూడా దోహదపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.