AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే గా జరుపుకుంటారు. వాస్తవానికి ఈ రోజును 1381 లో మొదటిసారి జరుపుకున్నారు. ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II ,బోహేమియా రాణి అన్నే నిశ్చితార్థాన్ని ప్రకటించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ డేని మార్చి 32వ తేదీగా ప్రకటించారు.

April Fools' Day: ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..
April Fools' Day 2023
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2023 | 7:05 AM

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ డే గా జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించబడుతున్న అంతర్జాతీయ కార్యక్రమం. ఈ రోజున జోక్స్ వేయడం, ఫన్నీ సన్నివేశాలతో సరదాగా గడపడం సర్వసాధారణం. తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను జోక్స్ తో లేదా చిన్న చిన్న సన్నివేశాలతో ఆటపట్టిస్తారు. ఇలా ఆనందిస్తూ.. ఫన్నీ మూమెంట్స్ ను ఆస్వాదిస్తూ ఏప్రిల్ ఫూల్స్ అని అరుస్తూ హర్షం వ్యక్తం చేస్తారు. ఈ ఏప్రిల్ ఫూల్స్ డే న హానికలిగించని వినోదం కోసం.. కొంత సేపు నవ్వులు పంచుతూ.. మీ సృజనాత్మకను చూపించడానికి ఒక గొప్ప అవకాశం కలిగించే రోజు. ఈ ఏప్రిల్ ఫూల్స్ డేన సంప్రదాయాలు కొన్ని ఆచరణాత్మక జోకులు, చిలిపి ఆటలతో ఆనందిస్తారు. కొన్ని దేశాల్లో, ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నానికి ముందు ఏప్రిల్ ఫూల్స్ జోకులు వేయాలన్నే నియమం కూడా ఉంది.

ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే గా జరుపుకుంటారు. వాస్తవానికి ఈ రోజును 1381 లో మొదటిసారి జరుపుకున్నారు. ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II ,బోహేమియా రాణి అన్నే నిశ్చితార్థాన్ని ప్రకటించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ డేని మార్చి 32వ తేదీగా ప్రకటించారు. ప్రజలు తేదీని పట్టించుకోకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే ఎవరికో అసలు క్యాలెండర్ లో 32వ తేదీ లేదు కదా అని ఆలోచించారు.. తాము మూర్ఖులమయ్యామని గ్రహించాడు. దీంతో అప్పటి నుంచి ఏప్రిల్ ఫూల్స్ డే మొదలైంది అని అంటారు.

1392లో.. కొన్ని దేశాల్లో, ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం ముందు ఏప్రిల్ ఫూల్స్ జోకులు వేయాలనే నియమం ఉంది.

ఇవి కూడా చదవండి

1500లో ఫ్రెంచ్ వారు జనవరి 1ని సంవత్సరంలో మొదటి రోజుగా స్వీకరించారు.

1592లో  జూలియన్ క్యాలెండర్ స్థానంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి కొత్త సంవత్సరం మొదటి రోజును ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు.

1700లలో, ఏప్రిల్ ఫూల్స్ డే UK అంతటా వ్యాపించింది.

ఏప్రిల్ ఫూల్స్ డే 2023 థీమ్ ఏప్రిల్ ఫూల్స్ డే.. వినోదం, ఉత్సాహాన్ని ఇచ్చే రోజు. ఈ రోజు ప్రాచుర్యం పొందటానికి కారణం చిలిపి పనులు, జోక్స్ అని చెప్పవచ్చు. ఈ ఫూల్స్ డే న అనేక బహుళజాతి సంస్థలు, వార్తాపత్రికలు సహా గూగుల్ కూడా ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తమ వినియోగదారులను మోసం చేస్తూ ఉంటాయి. వసంత ఋతువు, ఏప్రిల్ ఫూల్స్ డే రెండూ పూర్తి ఆనందాన్ని ఇస్తాయి.

ఏప్రిల్ ఫూల్స్ డే 2023 ప్రాముఖ్యత

ఏప్రిల్ ఫూల్స్ డేని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రేమ, నవ్వుకు అంకితం చేయబడిన రోజు.    హాస్యనటులు, సెలబ్రిటీలు ఉల్లాసకరమైన మీమ్‌లు లేదా సాధారణ జోక్‌లను పంచుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటారు. పిల్లలు, పురుషులు, మహిళలు అందరూ కలిసి వయస్సుతో నిమిత్తం లేకుండా ఒకరిపై ఒకరు చిలిపి మాటలు, జోకులు వేసుకుంటారు. చిలిపి పనులతో సరదాగా తమ వయసుని మరచి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక ప్రపంచ సరదా దినం.. ఏప్రిల్ ఫూల్స్ డే.  ఈ రోజును సంవత్సరంలో అత్యంత ఆనందదాయకంగా మార్చుకుంటారు. సుఖ సంతోషంగా, ఆనందంగా జీవించే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారని శాస్త్రీయంగా నిరూపించబడింది.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి వేదికగా మారుతుంది ఈ రోజు.  సంతోషం గుండె ఆరోగ్యం, రక్తపోటు, వంటి వాటిని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..