AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: పరగడుపునే ఈ రసం తాగితే చాలు.. ఆ సమస్యలకు టాటా చెప్పినట్లే..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకారకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీర బరువు..

Health Benefits: పరగడుపునే ఈ రసం తాగితే చాలు.. ఆ సమస్యలకు టాటా చెప్పినట్లే..!
Bitter Gourd Juice Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 01, 2023 | 11:04 AM

Share

Bitter Gourd Juice Benefits: చాలా మంది కాకరకాయ లేదా కాకరకాయ కూర అంటే ఇష్టపడరు. కానీ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం ఉపయోగించే కాషాయం అంటే కాకరకాయ రసాన్ని ఎన్నుకుంటారు. అందుకు దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. అవును, ఇందులో ఉండే రకరకాల పోషకాలు మన శరీరానికి అందడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవు. ఈ కారణంతోనే కాకరకాయ రసం మన ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఇక కాకరకాయ రసం లేదా జ్యూస్ గురించి మాట్లాడాలంటే ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకారకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీర బరువును తగ్గించడంలో, షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడం బేషుగ్గా పనిచేస్తాయి. అసలు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మనకు ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకరకాయ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు..

ఆకలి నియంత్రణ-బరువు తగ్గడం: చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటారు కానీ డైట్ ఫాలో కాలేరు. అలాంటివారు ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సమయం ఆకలి కోరికలు కలగవు. తద్వారా తేలికగా బరువు సమస్యను అధిగమించవచ్చు.

రోగనిరోధక వ్యవస్థ: కాకారకాయ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి .. మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. అదే క్రమంలో ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు కూడా షార్ప్‌గా ఉంటుంది. అయితే అందుకోసం ఖాళీ కడుపుతో మాత్రమే కాకరకాయ జ్యూస్ తాగాలి.

ఇవి కూడా చదవండి

మధుమేహం: డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా కాకరకాయ రసం లేదా కూర రూపంలో దీనిని తీసుకోవాలి. ఎందుకంటే కాకరకాయ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా ఇందులో షుగర్ కంటెంట్ లేనే లేదు.

జీర్ణవ్యవస్థ: ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపోతమవుతుంది. ఇందులో ఉండే పీచు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. అందువల్ల కడుపు లేదా అజీర్తి సమస్యలతో బాధపడేవారు కాకరకాయ జ్యూస్ తాగడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…