AB de Villiers: ధనాధన్ లీగ్ ప్లేఆఫ్స్‌కు చేరే 4 జట్లు ఇవే.. తేల్చేసిన ‘మిస్టర్ 360’..
ఐపీఎల్ పూర్తిగా ప్రారంభం కాకముందు నుంచే టోర్నీలో ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మిస్టర్ 360 ఏబీ డివిల్లియర్స్ కూడా తన అంచనాలను తెలిపాడు. డివిల్లియర్స్ ప్రకారం ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయంటే..
Updated on: Apr 01, 2023 | 9:47 AM

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ప్రారంభమై ఒక్క మ్యాచ్ మాత్రమే ముగిసింది. అయితే ఇప్పటికే ఈ సీజన్‌లో ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయనే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిల్లియర్స్ కూడా ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో ఉండబోయే టాప్-4 జట్లను చెప్పాడు.

ఏబీ డివిలియర్స్ ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించడం ఖాయం. అత్యుత్తమ జట్టు ఉన్న ఆర్‌సీబీ టాప్-4లో కనిపిస్తుందని ‘మిస్టర్ 360’ తెలిపాడు.

Chennai Super Kings

అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుందని ఏబీ డివిలియర్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టే నాలుగో జట్టుగా ఏబీ డివిలియర్స్ ఎంపిక చేశాడు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సమతూకంతో ఉంది. గుజరాత్ కూడా ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుందని అతను అభిప్రాయపడుతున్నాడు.

ఈ లిస్టులో మిస్టర్ 360 ఏబీ డీ విల్లియర్స్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ క్రికెట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఏబీ 43 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.




