- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: MS Dhoni joins the list of Batters with 200 sixes for a single IPL team
IPL 2023: ఐపీఎల్ ఆరంభంలోనే రికార్డు సృష్టించిన ధోని.. ఆర్‌సీబీ ఆధిపత్య లిస్టులోకి ‘చెన్నై కెప్టెన్’ ఎంట్రీ..
శుక్రవారం జరిగిన ఐపీఎల్ సీజన్ 16 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో చెన్నై టీమ్ ఓడినా.. అభిమానులను ధోని నిరుత్సాహపరచలేదు. చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ధోని 20వ ఓవర్ 3వ బంతిని సిక్సర్ కొట్టి అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. అయితే ఈ సిక్సర్‌తో ధోని ఐపీఎల్ రికార్డులకెక్కాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 01, 2023 | 7:46 AM

ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని 85 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ ఘనతను సాధించినన మొదటి బ్యాటర్‌గా కూడా ధోని నిలిచాడు.

ఈ క్రమంలనే తాజాగా చెన్నై టీమ్ కెప్టెన్ ధోని కూడా చేరాడు. మొత్తం 208 ఇన్నింగ్స్ ఆడిన ధోని 5004 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్న 7వ ప్లేయర్‌గా ధోని నిలిచాడు.

తద్వారా ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన 5వ బ్యాట్స్‌మ్యాన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇక ధోని కంటే ముందు ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ళు నలుగురు మాత్రమే. వారు ఎవరంటే..

1. క్రిస్ గేల్: గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన క్రిస్ గేల్ మొత్తం 239 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒకే ఒక జట్టు(ఆర్‌సీబీ) తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ రికార్డు సృష్టించడంతో పాటు లీస్టు అగ్రస్థానంలో నిలిచాడు.

2. ఏబీ డివిలియర్స్: మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఆ జట్టు తరపున మొత్తం 238 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 2వ స్థానంలో ‘మిస్టర్ 360’ నిలిచాడు

3. కీరన్ పొలార్డ్: ముంబై ఇండియన్స్ తరఫున 223 సిక్సర్లు బాదిన కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

4. విరాట్ కోహ్లీ: ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఆ జట్టు తరఫున 218 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచాడు కింగ్ కోహ్లీ.





