AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈ చెంబు అలాంటి ఇలాంటిది కాదా..? అది ఇంట్లో ఉంటే సిరుల పంటేనా

“రైస్ పుల్లింగ్ మహిమగల రాగి చెంబు” అంటూ అమాయకులను మోసం చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి రూపాయల విలువ కూడా లేని రాగి చెంబులను లక్షలకు అమ్ముతూ కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Andhra: ఈ చెంబు అలాంటి ఇలాంటిది కాదా..? అది ఇంట్లో ఉంటే సిరుల పంటేనా
Copper Pot Fraud
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 22, 2026 | 8:00 PM

Share

రైస్ పుల్లింగ్ రాగి చెంబు… మహిమగల రాగి చెంబు… ఇలాంటి చెంబు మీ ఇంట్లో ఉంటే కోట్లు సంపాదించవచ్చని మాయ మాటలు చెప్పి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు… వెయ్యి రూపాయలు ఖరీదు కూడా చేయని రాగి చెంబులను తయారుచేసి.. లక్షలకు మహిమగల రాగి చెంబు అని నమ్మించి అంటగట్టిన నాయకుడు బాగోతాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు తన వద్ద మహిమగల రాగి చెంబు ఉందని.. అది ఇంట్లో ఉంటే కోట్ల రూపాయలు కలిసి వస్తాయని.. మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించాడు. అసలు ఈ రోజుల్లో రైస్ పులింగ్ అనేది ఓ బూటకం అన్న సంగతి చాలా మందికి తెలుసు. అయినా కృష్ణారెడ్డి అమాయకులను టార్గెట్ చేసి.. మహిమగల రాగి చెంబు అని చెప్పి… దాన్ని కావలసిన వారికి డెమో ఇచ్చి మరీ.. కోట్ల రూపాయలు దోచుకున్నాడు.

తలుపుల మండల కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే బాధితుడు డీకే బాబు మాయమాటలు నమ్మి.. 20 లక్షల రూపాయలు ఇచ్చి రాగి చెంబు తీసుకున్నాడు. రాగి చెంబు ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని… కోట్లు సంపాదించవచ్చని చెప్పిన డీకే బాబు మాటలను నమ్మి బాధితుడు వేణుగోపాల్ రెడ్డి దాన్ని కొనుగోలు చేశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు. తనకు ఆ చెంబు వల్ల ఏం లాభం జరగడం లేదని.. చెంబు తీసుకుని.. తన డబ్బులు తనకు ఇవ్వాలని బాధితుడు వేణుగోపాల్ రెడ్డి డీకే బాబును అడిగాడు. దీంతో డీకే బాబు చంపుతానని బెదిరించడంతో వేణుగోపాల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తలుపుల పోలీసులు కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబుపై కేసు నమోదు చేశారు. అమాయకులను మాయమాటలతో నమ్మించి, బురిడీ కొట్టించి… ఉత్త రాగి చెంబులను… మహిమగల రాగి చెంబు అని మోసం చేస్తుండడంతో… నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డీకే బాబు వద్ద నుంచి ఒక ఫార్చునర్ కారు… ఐదు రాగి చెంబులు… మూడు సెల్ ఫోన్లు… లక్ష రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… మహిమలు గల రాగి చెంబు అని…. రైస్ పుల్లింగ్ రాగి చెంబు అని చెప్పే మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: పులి ఎదురుపడినప్పుడు ఏం చేయాలి.. ?

Follow Us
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?