IPL 2023: మైదానంలోకి వచ్చేస్తున్న వార్నర్ మామ.. ఢిల్లీపై హ్యట్రిక్ విక్టరీ కోసం లక్నో కన్ను.. తుది జట్టు వివరాలివే..
ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ లేకపోవడం ప్రధాన బలహీనత అని చెప్పుకోవాలి. అయితే అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీని నడిపిస్తున్నాడు. ఇక ఢిల్లీకి కూడా ముస్తఫిజుర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ ఆయా జట్లకు టోర్నీ ఎపెనింగ్ మ్యాచ్. ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే గతేడాది టోర్నీలో ఆరంగేట్రం చేసిన ఈ జట్టు పర్వాలేదనిపించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టుకు ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డీ కాక్, మోషిన్ ఖాన్ అందుబాటులో లేరు. అలాగే ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ లేకపోవడం ప్రధాన బలహీనత అని చెప్పుకోవాలి. అయితే అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీని నడిపిస్తున్నాడు. ఇక ఢిల్లీకి కూడా ముస్తఫిజుర్ రెహ్మాన్, ఎన్రిచ్ నోర్ట్జె, లుంగి ఎంగిడి వంటివారు అందుబాటులో ఉండబోవడం లేదు.
ఇక ఇరు జట్ల రికార్ఢుల విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్‌దే పైచేయి..! గత సీజన్‌లోనే ఆరంగేట్రం చేసిన లక్నో.. ఢిల్లీతో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా ఢిల్లీపై గెలిచి, హ్యట్రిక్ కొట్టాలని లక్నో టీమ్ చూస్తోంది. మరోవైపు గత సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్.. ఈ ఏడాది కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. అంటే నాయకత్వ బాధ్యతలు అతనికి పరీక్షే అనాలి. మరి తనకు కెప్టెన్సీ పరీక్షగా మారిన ఈ మ్యాచ్‌లో వార్నర్ మామ ఏం చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
తుది జట్ల వివరాలు(అంచనా)..
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జయదేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, సర్ఫరాజ్ ఖాన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్. ఇషాన్ పోరెల్,
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..