GT Vs CSK: చెన్నైపై గుజరాత్ హ్యట్రిక్ విజయం.. ఆరంభ మ్యాచ్‌పై వైరల్ అవుతున్న మిమ్స్..

ఇప్పటివరకు చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లలో గుజరాత్ మూడింటిలోనూ విజయం సాధించింది. ఇక దీనిపై సోషల్ మీడియా నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. అవి కాస్త నెట్టింట

GT Vs CSK: చెన్నైపై గుజరాత్ హ్యట్రిక్ విజయం.. ఆరంభ మ్యాచ్‌పై వైరల్ అవుతున్న మిమ్స్..
Gt Vs Csk
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 01, 2023 | 6:55 AM

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. సీజన్ కొత్తదే కానీ రికార్డు పాతదే. అవును, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్‌లలోనూ గుజరాత్ జట్టుదే విజయం. అంటే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లలో గుజరాత్ మూడింటిలోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇక దీనిపై సోషల్ మీడియా నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. చెన్నై ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కి దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై తరఫున రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగుల(50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు)తో చెలరేగగా.. చివరలో కెప్టెన్ ఎమ్ఎస్ ధోని 7 బంతుల్లోనే 14 పరుగులు రాబాట్టాడు.

అయితే అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ శుభ్‌మన్ గిల్ 63 పరుగులు(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విజయ్ శంకర్(21 బంతుల్లో 27 పరుగులు), వృద్ధిమాన్ సాహా(16 బంతుల్లో 25) చేయడంతో.. ఆ జట్టు విజయం ఖాయం అయింది. ఈ క్రమంలో గుజరాత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి జట్టు ఇచ్చిన  లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌పై ముందుగా చెప్పుకున్నట్లే అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవేమిటో ఒక లుక్కేయండి..

గుజరాత్ vs చెన్నై మ్యాచ్‌పై అభిమానుల స్పందన

‘చెన్నైకి డెత్ ఓవర్స్ బౌలర్ కావాలి’..

‘అభిమానుల పరిస్థితి’..

‘మొదటి మ్యాచ్ తర్వాత CSK అభిమానుల పరిస్థితి’..

‘రషీద్ ప్లేయింగ్, పాండ్యా కెప్టెన్సీ’..

‘స్టార్ పెర్ఫార్మర్’..

‘రషీద్ ఖాన్ స్టైల్’..

‘బాధిస్తుంది కానీ నడుస్తుంది’..

‘రూ.16 కోట్లు వృధా’..

‘గుజరాత్‌పై ఇంతే’..

‘ఏదీ అసాధ్యం కాదు’..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..