AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ధావన్‌కు ‘ఐపీఎల్ పరీక్ష’.. రెండో మ్యాచ్‌లో తలపడనున్న పంజాబ్, కోల్‌కతా.. తుదిజట్టు వివరాలివే..

ఐపీఎల్ 2023 టోర్నీలో రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు..

IPL 2023: ధావన్‌కు ‘ఐపీఎల్ పరీక్ష’.. రెండో మ్యాచ్‌లో తలపడనున్న పంజాబ్, కోల్‌కతా.. తుదిజట్టు వివరాలివే..
Pbks Vs Kkr
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 01, 2023 | 8:27 AM

Share

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ టోర్నీ తిరిగి ప్రారంభ అయింది. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ మొదటి మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఐపీఎల్ 2023 టోర్నీలో రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు గత సీజన్‌లో నాయకత్వం వహించిన మయాంక్ అగర్వాల్‌ను ఫ్రాంచైజీ రిలీజ్ చేసి, శిఖర్ ధావన్‌ను ప్రస్తుత సీజన్ కోసం కెప్టెన్‌గా నియమించింది. అయితే గబ్బర్‌కి ఇది పంజాబ్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో ఇది అతనికి పెద్ద పరీక్షే అని చెప్పుకోవాలి. అలాగే గాయం కారణంగా కోల్‌కతా జట్టును 15వ సీజన్‌లో నడిపించిన శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో.. ఆ టీమ్‌ని యువ ఆటగాడు నితీష్ రాణా నడిపిస్తున్నాడు.

అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కర్రన్‌ నేడు పంజాబ్ తరఫున మైదానంలోకి దిగుతున్నాడు. ఇటీవల జరిగన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ అతని కోసం రూ.18.50 కోట్లను వెచ్చించింది. ఇక పంజాబ్‌ టీమ్‌కు ఇంగ్లాండ్ ఆటగాడైన జానీ బెయిర్‌స్టో ఈ సీజన్‌లో అందుబాటులో ఉండబోవడంలేదు. ఫలితంగా అతని స్థానంలోకి బీబీఎల్ 2022-23లో అత్యధిక పరుగులు చేసిన  రెండో ఆటగాడు మాథ్యూ షార్ట్ వచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కసిగో రబడా ప్రారంభ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఇదే క్రమంలో కోల్‌కతాను కూడా లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ జట్టు తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేరు.

తుది జట్టు వివరాలివే(అంచనా)..

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్) , షారుక్ ఖాన్ , బి రాజపక్సే , సికందర్ రజా , సామ్ కర్రాన్ , రిషి ధావన్ , మాథ్యూ షార్ట్ , జితేష్ శర్మ ,  హర్‌ప్రీత్ బ్రార్ , రాహుల్ చాహర్ , అర్ష్‌దీప్ సింగ్

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్ , నితీష్  రాణా(కెప్టెన్) , వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ , సునీల్ నరైన్ , నారాయణ్ జగదీషన్ , రహ్మానుల్లా గుర్బాజ్ , శార్దూల్ ఠాకూర్ , లాకీ ఫెర్గూసన్ , వరుణ్ చక్రవర్తి , ఉమేష్ యాదవ్,

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..