G20 Sherpa Meet: ప్రారంభమైన రెండో రౌండ్ షెప్రా సమావేశం.. ‘వారందరికీ ధన్యవాదాలు’ అంటూ..

షెర్పా మీటింగ్‌లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ మాట్లాడుతూ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకముందు షెర్పా సమావేశానికి వచ్చిన ప్రతినిధులను

G20 Sherpa Meet: ప్రారంభమైన రెండో రౌండ్ షెప్రా సమావేశం.. ‘వారందరికీ ధన్యవాదాలు’ అంటూ..
Central Minister V Muralitharan and India's G20 Sherpa Amitabh Kant
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 31, 2023 | 2:06 PM

G20 Sherpa Meet: భారత్‌లో G20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందుగా.. దేశంలోని 50 ప్రధాన నగరాల్లో జీ20 సమ్మిట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పాటికే ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాల్లో జీ20 సన్నాహక సమావేశాలు ముగిసాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే మార్చి 31న కేరళలోని కుమరకోమ్‌లో రెండవ రౌండ్ షెప్రా సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ సమావేశాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తన ప్రసంగంతో ప్రారంభించారు. షెర్పా మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకముందు షెర్పా సమావేశానికి వచ్చిన ప్రతినిధులను ఆయన సాదరంగా స్వాగతించారు. ఇంకా ఈ సందర్భంగా జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారతదేశానికి మద్ధుతు తెలిపిన ఆయా దేశాల ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

G20 షెర్పా మీటింగ్‌లో భారత జీ20 షెర్పా..

G20 షెర్పా మీటింగ్‌లో భారత జీ20 షెర్పా అమితాబ్ కాంత్  తన ప్రసంగాన్ని అందించారు. ఈ సమయంలో ఆయన ఇండోనేషియా, బ్రెజిల్‌ దేశాలతో పాటు ఇతర G20 దేశాల ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు. అయితే ఆయన రెండో సెషన్‌లో ఈ చర్చలు  జరిపారు. ఇక అంతకముందు జరిగిన మొదటి సెషన్‌లో డిజిటల్ ఎకానమీ, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, కల్చర్ వర్కింగ్ గ్రూపులకు సంబంధించిన సాంకేతిక పరివర్తనపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

ఇక ఈ సమావేశంలో జీ20 దేశాల నుంచి 120 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు 9 ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించబడ్డారు. ఈ సమావేశంలో కొన్ని అంతర్జాతీయ, స్థానిక సంస్థలు కూడా పాల్గొనే అవకాశం కూడా లభించడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..