Health Tips: చపాతీలను ఇలా చేసుకుని తింటున్నారా? బీకేర్‌ఫుల్.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది..!

మన దేశంలో ఎక్కవ శాతం మంది ప్రజలు తమ తమ ఇళ్లలో రోటీ/చపాతీలను చేసుకుంటారు. అయితే, ప్రాంతాన్ని బట్టి ఆ రోటీలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరు పాన్ మీద వేడి చేస్తే.. మరికొందరు పటకారు సాయంతో నేరుగా మంట మీదనే తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల రుచిలోనూ, రోటీ కాల్చే విధానంలోనూ..

Health Tips: చపాతీలను ఇలా చేసుకుని తింటున్నారా? బీకేర్‌ఫుల్.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది..!
Roti
Follow us

|

Updated on: Apr 01, 2023 | 6:36 AM

మన దేశంలో ఎక్కవ శాతం మంది ప్రజలు తమ తమ ఇళ్లలో రోటీ/చపాతీలను చేసుకుంటారు. అయితే, ప్రాంతాన్ని బట్టి ఆ రోటీలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరు పాన్ మీద వేడి చేస్తే.. మరికొందరు పటకారు సాయంతో నేరుగా మంట మీదనే తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల రుచిలోనూ, రోటీ కాల్చే విధానంలోనూ తేడా ఉంటుంది. అయితే, రోటీ తయారీకి సంబంధించి ఓ పరిశోధన ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని అధ్యయనాల ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత వంట పద్ధతులు హెటెరోసైక్లిక్ అమైన్‌లు(HCA), పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లను (PAHs) ఉత్పత్తి చేస్తాయి. వీటిని క్యాన్సర్ కారకాలుగా పిలుస్తారు.

పరిశోధనలో ఏం తేలిందంటే..

జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. సహజ వాయువు స్టవ్‌లు, కుక్‌టాప్‌లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయి. అసురక్షితమని భావించే చిన్న రేణువులను విడుదల చేస్తాయి. వీటి వలన శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది మాత్రమే కాదు.. న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని వండడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని వెల్లడించింది. మరి రోటీలను ఎలా తయారు చేయాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోటీల కారణంగా క్యాన్సర్!

ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (FSANZ)లో చీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ పాల్ బ్రెంట్ 2011లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. రోటీలు గ్యాస్ ఫ్లేమ్స్‌తో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు, అది అక్రిలమైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. గ్యాస్ ప్రత్యక్ష మంటలలో ఆహారాన్ని వండినప్పుడు, క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి చేయబడతాయి. ఇవి మనిషి శరీరానికి ప్రమాదకరమైనవి. ఈ పరిశోధనల ప్రకారం.. ప్రత్యక్ష మంటపై చేసిన బ్రెడ్, రోటీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే, ఇలా తయారు చేసిన రోటీలు తినడం నిజంగా క్యాన్సర్‌కు కారణమవుతుందా? లేదా? అనే దానిపై మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..