Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 3వేలకు పైగా కొత్త కేసులు.. అగ్రస్థానంలో కేరళ

మహారాష్ట్ర, కేరళ,  గుజరాత్‌లలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 9115 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో (15208) 60 శాతం అంటే.. 3852 మంది యాక్టివ్ పేషెంట్లతో కేరళ అగ్రస్థానంలో ఉంది.

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 3వేలకు పైగా కొత్త కేసులు.. అగ్రస్థానంలో కేరళ
Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2023 | 7:57 AM

భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది. క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్ళీ మరోసారి కేసులు పెరుగుతున్నాయి. గత 2 రోజులుగా రోజుకు 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ,  గుజరాత్‌లలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 9115 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో (15208) 60 శాతం అంటే.. 3852 మంది యాక్టివ్ పేషెంట్లతో కేరళ అగ్రస్థానంలో ఉంది. అనంతరం 3016 కేసులతో గుజరాత్‌లో రెండవ స్థానంలో ఉండగా.. మహారాష్ట్రలో 2247 కేసులు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కేవలం రెండు రోజుల్లోనే 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళతో పాటు రాజధాని ఢిల్లీలోనూ కరోనా  వైరస్ విస్తరిస్తోంది. ఢిల్లీలోని పలు జిల్లాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ రేటు 13 శాతం దాటింది. రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్‌ నివారణకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న బాధితులు మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో 60 మందికి పైగా కరోనా రోగులు చేరారు. మహారాష్ట్రలోని ముంబైలోని ఆసుపత్రుల్లో 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే.. రెండు రాష్ట్రాల్లోనూ కోవిడ్ మరణాల రేటు నమోదు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయమే. Omicron కొత్త వేరియంట్  XBB.1.16  కారణంగా, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు XBB.1.16 వేరియంట్‌తో బారిన పడుతున్నారు.

XBB.1.16 వేరియంట్  Omicron సరికొత్త వేరియంట్  XBB.1.16 తో భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ రూపాంతర వేరియంట్  లక్షణాలు ఫ్లూ లాగా ఉంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ అంటువ్యాధి. పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించే అలవాటును మళ్లీ అలవర్చుకోవాలి. దీనితో పాటు, అధిక ప్రమాదం ఉన్నవారు కూడా వ్యాక్సిన్ బూస్టర్ ను  తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..