Toll Tax Hike: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ప్లాజా ఫీజులు.. అర్థరాత్రి నుంచి అమలులోకి కొత్త ధరలు

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ప్లాజా ఛార్జీలు శనివారం (ఏప్రిల్‌ 1న) నుంచి అమల్లోకి వచ్చాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది.

Toll Tax Hike: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ప్లాజా ఫీజులు.. అర్థరాత్రి నుంచి అమలులోకి కొత్త ధరలు
Toll Charges
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2023 | 7:32 AM

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ప్లాజా ఛార్జీలు శనివారం (ఏప్రిల్‌ 1న) నుంచి అమల్లోకి వచ్చాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. నెలవారీ పాస్‌లపై రూ.275 నుంచి రూ.330 వరకు పెంచింది. ఈ పెరిగిన ఛార్జీలు ఏడాది పాటు అమలులో ఉండనున్నాయి. జాతీయ రహదారుల ఫీజు (డిటర్మినేషన్‌ ఆఫ్‌ రేట్స్‌ అండ్‌ కలక్షన్‌) నిబంధనలు-2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్‌ట్యాక్సుల సవరణ చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) ప్రకటన విడుదల చేసింది. ప్రాంతాలు రద్దీకి అనుగుణంగా ఛార్జీలను పెంచారు. 3.5 – 7 శాతం నుంచి 10 శాతం మేర ఫీజును పెంచారు.

ప్రతిఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా టోల్‌ ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది టోల్‌ ఛార్జీలను ఏకంగా 5 శాతం పెంచనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు. పెరిగిన టోల్‌ ఛార్జీల వల్ల కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10కి, బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కి, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50కి పెంచారు. ప్రస్తుత ట్యాక్స్‌పై పెంపుదల సగటున 4 నుంచి 4.5 శాతం ఉంది. దీంతో సాధారణ ప్రజల రవాణా సాధనమైన బస్సు ప్రయాణం కూడా మరింత భారం కానున్నది.

జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను 5శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సిద్ధమయ్యాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్‌ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు సమాచారం.. తెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. టోల్‌ ప్లాజా నుంచి వెళ్లే ఆర్డినరీ సర్వీసులకు కూడా రూ.4 పెంచినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

టోల్ ఫీజుల ఛార్ట్..

Toll Tax

Toll Tax

మరిన్ని జాతీయ వార్తల కోసం..