Donkey Milk: గాడిద పాలు నిజంగా ఆరోగ్యమేనా? అసలు కథ ఇక్కడ తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో గాడిద పాలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఈ పాము మార్కెట్‌లో, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. వాస్తవానికి గాడిదలు ఈక్విడే కుటుంబానికి చెందినవి. ఇందులో గుర్రాలు, జీబ్రాస్ కూడా ఉంటాయి. అయితే, గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు.

Donkey Milk: గాడిద పాలు నిజంగా ఆరోగ్యమేనా? అసలు కథ ఇక్కడ తెలుసుకోండి..
Donkey
Follow us

|

Updated on: Mar 31, 2023 | 7:11 AM

ప్రస్తుత కాలంలో గాడిద పాలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఈ పాము మార్కెట్‌లో, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. వాస్తవానికి గాడిదలు ఈక్విడే కుటుంబానికి చెందినవి. ఇందులో గుర్రాలు, జీబ్రాస్ కూడా ఉంటాయి. అయితే, గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఇక పురాతన కాలం నుంచి నేటి వరకు రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా కూడా గాడిద పాలను ఉపయోగిస్తున్నారు. గాడిద పాలలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆఫ్రికా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ లకు నివారణగా ఉపయోగిస్తారు. ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే.. గాడిద పాలు మనిషి తల్లి పాలను పోలి ఉంటాయి. అందుకే, ఇది 19వ శతాబ్దంలో అనాథ శిశువులకు తల్లి పాల రూపంలో ఇచ్చేవారట.

గాడిద పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సమస్యలను నివారించడానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఈ పాలలో ఉన్నాయి. గాడిద పాలు మంచి మాయిశ్చరైజర్. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో గాడిద పాలు అద్భుతంగా పని చేస్తాయి.

గాడిద పాలు ప్రతికూలతలు..

గాడిద పాలు చాలా ఖరీదైనది. ఈ పాలు కొన్ని దేశాల్లో మాత్రమే లభిస్తాయి. ఈ పాలను కావాలనుకుంటే మార్కెట్‌లో పొడి రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ పొడి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, పాలలోని లాక్టోస్ కంటెంట్ అపానవాయువు, ఆమ్లత్వం వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..