AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుక.. హెలికాప్టర్‌లో అయోధ్య చుట్టివచ్చే అవకాశం..

శ్రీరామనవమి సందర్భంగా రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది. శ్రీరాముడి పవిత్ర నగరమైన అయోధ్యలో రామ నవమి సందర్భంగా అయోధ్యను సందర్శించే భక్తులు, పర్యాటకులు, అతిథులను హెలికాప్టర్‌లో శ్రీరాముడికి సంబంధించిన ప్రదేశాలకు తీసుకువెళతారు.

Sri Rama Navami: రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుక.. హెలికాప్టర్‌లో అయోధ్య చుట్టివచ్చే అవకాశం..
Helicopter Trip
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 31, 2023 | 7:25 AM

Share

శ్రీరామనవమి సందర్భంగా రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది. శ్రీరాముడి పవిత్ర నగరమైన అయోధ్యలో రామ నవమి సందర్భంగా అయోధ్యను సందర్శించే భక్తులు, పర్యాటకులు, అతిథులను హెలికాప్టర్‌లో శ్రీరాముడికి సంబంధించిన ప్రదేశాలకు తీసుకువెళతారు.

ఈ సౌకర్యం వచ్చే 15 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ జాయ్‌రైడ్‌కు ఒక్కొక్కరికి ఎనిమిది నిమిషాలకు రూ. 3,000గా నిర్ణయించారు. ఈ సేవను పర్యాటక శాఖ ప్రారంభించింది. భక్తులు హెలికాప్టర్‌లో ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అయోధ్య ధామ్‌ని సందర్శించవచ్చు. హెలికాప్టర్‌లో ఒకేసారి ఏడుగురు ప్రయాణించవచ్చు.ఆకాశం నుంచి అయోధ్యలోని సరయూ నది, రామజన్మభూమి, హనుమాన్‌గర్హి తదితర ఆలయాలను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..