Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ramanavami: నేడు భద్రాద్రిలో శ్రీరామ పుష్కర పట్టాభిషేకం.. పాల్గొననున్న గవర్నర్‌ తమిళిసై

పన్నెండేళ్లకుఒకసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నేడు భద్రాద్రి రామయ్యకు జరగనుంది. కల్యాణమూర్తులైన సీతారామచంద్రస్వామికి జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, అహోబిల జీయర్‌స్వామి, దేవనాద జీయర్‌స్వామి హాజరుకానున్నారు.

Sri Ramanavami: నేడు భద్రాద్రిలో శ్రీరామ పుష్కర పట్టాభిషేకం.. పాల్గొననున్న గవర్నర్‌ తమిళిసై
Sri Rama Pattabhishekam
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 7:19 AM

తెలుగువారి అయోధ్యాపురి భద్రాద్రిలో శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా  సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నేడు  భద్రాచలంలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకాన్నీ నిర్వహించనున్నారు. నేడు శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం జరగనుంది. ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు, భక్తులు నేత్ర పర్వం గా  తిలకించి పులకితులవుతారట. అయితే ఈ ఏడాది పట్టాభిషేకం మరీ విశిష్టతను  సంతరించుకుంది.

పన్నెండేళ్లకుఒకసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నేడు భద్రాద్రి రామయ్యకు జరగనుంది. కల్యాణమూర్తులైన సీతారామచంద్రస్వామికి జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, అహోబిల జీయర్‌స్వామి, దేవనాద జీయర్‌స్వామి హాజరుకానున్నారు.

ఈ శ్రీరామ పట్టాభిషేకంలో  పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై రాత్రి రైలులో హైదరాబాద్ నుంచి లుదేరి భద్రాచలం చేరుకున్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేశారు.  గత ఏడాది కూడా రైలులోనే ప్రయాణించి భద్రాద్రి ఆలయంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు తమిళిసై.

ఇవి కూడా చదవండి

రైలు మార్గం ద్వారా హైదరాబాదు నుండి కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ తమిళిసైకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ లు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలంలోని ఐటిసి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

వాస్తవానికి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరిగిన మర్నాడు నిర్వహించే కార్యక్రమం శ్రీరామ పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకాన్ని పూర్వం 60 ఏళ్లకు ఒక్కసారి జరిపేవారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంగా పిలిచేవారు. ఇలా 1927, 1987లో మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు జరిగాయి.  కాలక్రమంలో భక్తుల సౌకర్యార్ధం.. పట్టిభిషేకంలో మార్పులు చేసి.. 12 ఏళ్లకు ఒక్కసారి పుష్కర పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది జరగనున్న పుష్కర పట్టాభిషేకాన్ని తిలకించడానికి భద్రాచలానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..