AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: ఏప్రిల్ 14 న మేషరాశిలోకి సూర్యుడు.. నెల రోజులు ఈ రాశులకు అన్నింటా విజయమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

మే 14, 2023 వరకు సూర్యుడు ఈ రాశిలో ఉంటాడు.. అనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.

Sun Transit: ఏప్రిల్ 14 న మేషరాశిలోకి సూర్యుడు.. నెల రోజులు ఈ రాశులకు అన్నింటా విజయమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Sun Transit
Surya Kala
|

Updated on: Mar 28, 2023 | 8:50 AM

Share

జ్యోతిషశాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో తమ రాశిని మార్చుకుంటాయి. ఇలా గ్రహాలు తమ రాశిని మార్చుకునే సమయంలో ఈ ప్రభావం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై పడుతుంది. గ్రహాలకు అధిపతి సూర్యుడు ప్రతి నెలా తన స్థానాన్ని మార్చుకుంటాడు. దీనిని సూర్య సంక్రాంతి అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహాన్ని గ్రహాల రాజు అంటారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే.. ఆ వ్యక్తులు తమ జీవితంలో అన్ని రకాల విజయాలను పొందుతారు. అంతేకాదు అతనికి గౌరవం, కీర్తి లభిస్తుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు.

సూర్య భగవానుడు మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. దీంతో సూర్యుడు ఎల్లప్పుడూ ఈ రాశివారికి మంచి ఫలితాలను ఇస్తాడు. మే 14, 2023 వరకు సూర్యుడు ఈ రాశిలో ఉంటాడు.. అనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.

మిధున రాశి ఈ రాశిలోని వ్యక్తులకు సూర్యుని మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు ఈ రాశి వ్యక్తుల జాతకంలో లాభం, ఆదాయ స్థానంలో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో వీరు తమ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. ఏకకాలంలో అనేక ఆదాయ మార్గాలను పొందుతారు. భూమి, ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక త్వరలో నెరవేరుతుంది. ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి ఈ రాశి వారికి, సూర్యుడు ఉచ్ఛమైన రాశిలో రావడం శుభప్రదంగా ఉంటుంది. కెరీర్, వ్యాపార పరంగా రాబోయే కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరి జాతకంలో సూర్యుడు సంచరించడం వల్ల ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో విస్తరణ జరిగే అవకాశం ఉంది. రాబోయే కాలం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి  ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు సూర్యభగవానుడు తన ఉన్నతమైన రాశి.. మేషరాశిలో ఉంటాడు. సింహ రాశి వారికి సూర్యుడు ఉచ్ఛమైన రాశిలోకి రావడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి అదృష్టం, కర్మ స్థానంలో సూర్యదేవుడు వస్తాడు. అటువంటి పరిస్థితిలో.. వీరికి సర్వత్రా అదృష్టం లభిస్తుంది. వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు. ప్రతి నిర్ణయంలో తండ్రి మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చూస్తారు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్