Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఉద్యోగంలో, జీవితంలో అనుకోని సమస్యలా.. తమలపాకుతో ఇలా చేసి చూడండి..

జ్యోతిష్య శాస్త్రంలో కూడా తమలపాకులకు సంబంధించిన అనేక రకాల నివారణలు చెప్పబడ్డాయి. వీటిని చేయడం ద్వారా జీవితంలోని అన్ని రకాల సమస్యలు నివారింపబడి  జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఈరోజు తమలపాకులకు సంబంధించిన కొన్ని చర్యలను తెలుసుకుందాం.

Vastu Tips: ఉద్యోగంలో, జీవితంలో అనుకోని సమస్యలా.. తమలపాకుతో ఇలా చేసి చూడండి..
Battle Leaf
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2023 | 10:33 AM

హిందూమతంలో తులసి మొక్క , ఆకులు ఎంత పవిత్రంగా భావిస్తారో.. అదే విధంగా తమలకులను కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. పూజ నుంచి పెళ్ళి వరకూ తమలపాకు తప్పనిసరి. తమలపాకులను నాగవల్లి అని కూడా అంటారు. తమలపాకులను గ్రంధాలలో చాలా పవిత్రమైనగా భావిస్తారు. దేవుళ్లను తాంబూలం ను నైవేద్యంగా సమర్పిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా తమలపాకులకు సంబంధించిన అనేక రకాల నివారణలు చెప్పబడ్డాయి. వీటిని చేయడం ద్వారా జీవితంలోని అన్ని రకాల సమస్యలు నివారింపబడి  జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఈరోజు తమలపాకులకు సంబంధించిన కొన్ని చర్యలను తెలుసుకుందాం.

పనుల్లో విజయం సాధించడానికి కొన్ని పనులు ఎన్నిసార్లు చేసినా విజయం దక్కదు. అటువంటి పరిస్థితిలో తమలపాకులకు సంబంధించిన కొన్ని చర్యలు మిమ్మల్ని విజయవంతం చేయగలవు. జ్యోతిష్యం ప్రకారం.. ఉద్యోగంలో విజయం సాధించాలంటే, ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో మీ జేబులో తమలపాకును ఉంచుకోండి. ఈ పరిహారంతో, మీరు త్వరగా ఉద్యోగంలో విజయం పొందుతారు.

బాధ నుండి ఉపశమనం పొందేందుకు ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలు కలిసి వస్తాయి. జీవితంలోని కష్టాలు తొలగిపోవాలంటే మంగళ, శనివారాల్లో హనుమంతుడికి తమలపాకులు సమర్పించండి. ఈ పరిహారంతో, హనుమంతుడు అన్ని రకాల కష్టాలను వెంటనే తొలగిస్తాడు.

ఇవి కూడా చదవండి

వ్యాపారంలో ఎదగడానికి ఏదైనా వ్యాపారం సరిగ్గా జరగకపోతే..  మీరు నిరంతరం నష్టాలను చవిచూస్తుంటే..  5 తమలపాకులను ఒక దారంలో కట్టి, వాటిని శనివారం ఆ సంస్థకు తూర్పు దిశలో ఉంచండి. ఈ విధంగా, ప్రతి శనివారం ఈ పరిహారం పునరావృతం చేస్తూ ఉండండి. పాత ఆకులను ప్రవహిస్తున్న నదిలో విడిచిపెట్టండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి.

వైవాహిక జీవితంలో మాధుర్యం కోసం ఎవరి జీవితంలోనైనా తమ జీవిత భాగస్వామితో మంచి సంబంధం లేకుంటే.. తరచుగా టెన్షన్స్ ఏర్పడుతుంటే, అప్పుడు కొన్ని గులాబీ రేకులను తమలపాకుపై ఉంచి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయండి. వరుసగా 4 శుక్రవారాలు ఈ రకమైన నివారణ చర్యలు ప్రయత్నిస్తూ ఉండండి. ఈ పరిహారం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది.

ప్రతికూల శక్తులను తొలగించడానికి వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం ఉన్న ఇళ్లలో ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా, ఒక వ్యక్తి చాలా ఒత్తిడిలో ఉంటాడు. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉండటం వల్ల డబ్బు నష్ట పోతారు..  వైఫల్యాలకు దారితీస్తుంది. ఇంట్లో ఉండే వాస్తుదోషం తొలగిపోవాలంటే తమలపాకుల్లో పసుపు కలిపి ఇంటింటా చల్లాలి. ఈ పరిహారంతో, ఇంట్లో వ్యాపించిన ప్రతికూల శక్తులు పోయి ధనం లభిస్తుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)