Sri Kalahasti: ప్రసన్న వరదరాజ స్వామి వారి నగలు అమ్మకానికి పెట్టారంటున్న టీటీడీ అధికారి.. రుజువు చేయమంటూ శ్రీకాళ హస్తి ఆలయ చైర్మన్ ఛాలెంజ్

శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునః నిర్మాణం రాష్ట్ర స్థపతి సూచనల మేరకే చేపట్టామని వివరణ ఇచ్చారు. ఈనెల 17న భక్తులు, స్థానికుల సమక్షంలోనే ఆలయ మూల విరాట్ విగ్రహం తొలగింపు చేపట్టామని దేవస్థానం పాలకమండలి సిబ్బంది చెప్పారు. 

Sri Kalahasti: ప్రసన్న వరదరాజ స్వామి వారి నగలు అమ్మకానికి పెట్టారంటున్న టీటీడీ అధికారి.. రుజువు చేయమంటూ శ్రీకాళ హస్తి ఆలయ చైర్మన్ ఛాలెంజ్
Prasanna Varadaraja Swami
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2023 | 9:41 AM

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. ఆలయ మూలవిరాట్ తొలగింపు వ్యవహారంపై విపక్షాలకు, పాలకమండలికి మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూలవిరాట్ విగ్రహం తొలగింపు సమయంలో బంగారు నాణ్యాలు, ఆభరణాలు లభించాయని శ్రీకాళహస్తిలోని టీటీడీ అధికారులు అంటున్నారు. అంతేకాదు విలువైన బంగారు ఆభరణాలను స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ హైదరాబాదులో అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రీకాళహస్తి ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ ఆరోపిస్తున్నారు.

అయితే టీటీడీ అధికారి చేస్తోన్న ఆరోపణలను ఖండించారు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాస్. అసత్య ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతీయొద్దన్నారు అంజూరు శ్రీనివాస్. శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునః నిర్మాణం రాష్ట్ర స్థపతి సూచనల మేరకే చేపట్టామని వివరణ ఇచ్చారు. ఈనెల 17న భక్తులు, స్థానికుల సమక్షంలోనే ఆలయ మూల విరాట్ విగ్రహం తొలగింపు చేపట్టామని దేవస్థానం పాలకమండలి సిబ్బంది చెప్పారు.

అంతేకాదు.. మూలవిరాట్ తొలగింపు సమయంలో బంగారు నాణ్యాలు దొరికాయని, వాటిని అమ్మే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపై ఆధారాలను టీటీడీ బయట పెట్టాలని కాళహస్తి చైర్మన్ డిమాండ్ చేశారు.  ఆరోపణలపై ఆధారాలు ఉంటే వెల్లడించాలంటూ సవాల్ చేశారు.  అంతేకాదు శ్రీకాళ హస్తి ఆలయంలోని దక్షిణామూర్తి సన్నిధి లేదంటే కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేయాలని సుధీర్ కు అంజూరు శ్రీనివాస్ చాలెంజ్విసిరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..