AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fengshui Tips: ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల కెరీర్‌లో సమస్యలు.. సుఖ సంపదల కోసం ఈ చర్యలు చేయండి

ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో ఎప్పుడూ మూసిన లేదా పాడైన గడియారాన్ని ఉంచవద్దు. వాచ్, గడియారం పాడైతే, వీలైనంత త్వరగా వెంటనే సరిచేయించుకోండి. 

Fengshui Tips: ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల కెరీర్‌లో సమస్యలు.. సుఖ సంపదల కోసం ఈ చర్యలు చేయండి
Fengshui Tips
Surya Kala
|

Updated on: Mar 24, 2023 | 11:54 AM

Share

మనమందరం సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి సంపదను కోరుకుంటాం.  దీంతో ఫెంగ్ షుయ్ వస్తువులను ఇంట్లో పెట్టుకునే ట్రెండ్ పెరుగుతోంది. ఫెంగ్ షుయ్ ఒక పురాతన చైనీస్ కళ. ఫెంగ్ షుయ్ వస్తువులను ఏర్పాటు చేసుకోవడంతో ఇల్లు, దాని చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న శక్తితో సమతుల్యతను సృష్టిస్తుందని విశ్వాసం. సానుకూల శక్తులు, సంపద , అదృష్టాన్ని తెస్తుందని భావించడంతో ఫెంగ్ షుయ్ వస్తువుల వాడకం పెరుగుతోంది. ఇంటి కోసం కొన్ని సులభమైన ఫెంగ్ షుయ్ చిట్కాలను తెలుసుకుందాం-

1. సమయం గురించి తెలుసుకోవడానికి ప్రతి ఇంట్లో ఒక గడియారం ఏర్పాటు చేసుకుంటారు. అయితే చాలా చిన్న విషయాలను పట్టించుకోమ్. ఇలా గడియారం ఏర్పాటు చేసుకోవడం ఇల్లు, దాని వాస్తుపై ప్రభావం చూపుతుంది. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో ఎప్పుడూ మూసిన లేదా పాడైన గడియారాన్ని ఉంచవద్దు. వాచ్, గడియారం పాడైతే, వీలైనంత త్వరగా వెంటనే సరిచేయించుకోండి.

2. ఇంటి అలంకరణను పెంచేందుకు వివిధ రకాల మొక్కలను నాటుతారు. ఫెంగ్ షుయ్ ప్రకారం బాల్కనీలో నాటిన మనీ ప్లాంట్ ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుంటే వాస్తవానికి రాబోయే ఆర్థిక సంక్షోభానికి గుర్తు అని చెబుతున్నారు

ఇవి కూడా చదవండి

3. ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంట్లో గాజు కిటికీలను అమర్చడం ద్వారా.. సూర్యకాంతి ద్వారా కొత్త శక్తి ప్రవేశిస్తుంది.

4. ఫెంగ్ షుయ్ ప్రకారం పొరపాటున కూడా మంచం ముందు అద్దం పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల గది మొత్తం ఉద్రిక్తంగా మారుతుంది.

5. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటి లోపల ప్రతికూల, చెడు శక్తి ప్రవేశించకుండా నిరోధించడానికి హార్స్ షూను తలుపు మీద వేలాడదీయండి. ఇది ఇంటిలో ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతుంది.

6. యుద్ధం లేదా హృదయం పగిలిన పెయింటింగ్ లేదా ఫోటోను ఇంట్లో ఉంచవద్దు.

7. ఇంటి లోపల బోన్సాయ్ మొక్కను పెంచవద్దు. ఈ మొక్క కుటుంబ సభ్యుల వృత్తి , వ్యాపారంపై చెడు ప్రభావం చూపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)