AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Transit: మేషరాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ రాశుల వ్యాపారస్తులకు లక్కే లక్కు.. అదృష్టం వీరి సొంతం

బుధ గ్రహం గ్రహాలకు యువరాజు. బుధుడు వ్యాపారం, ప్రసంగం, గణితం, తర్కాలకు కారకంగా పరిగణించబడుతున్నాడు. మార్చి 31, 2023న మధ్యాహ్నం 2.44 గంటలకు బుధుడు ..మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు జూన్ 7 వరకు ఈ రాశిలో ఉంటాడు.

Mercury Transit: మేషరాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ రాశుల వ్యాపారస్తులకు లక్కే లక్కు.. అదృష్టం వీరి సొంతం
Mercury Transit
Surya Kala
|

Updated on: Mar 24, 2023 | 9:34 AM

Share

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఒక నిర్దిష్ట వ్యవధిలో..  అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ సంచరిస్తారు. ఇలా గ్రహ సంచారం అన్ని రాశులపై ప్రభావితం పడుతుంది. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు, శని దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఈ విధంగా తొమ్మిది గ్రహాలు కూడా ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు తెలివితేటలకు, వ్యాపారానికి కారకుడైన బుధుడు త్వరలో తన రాశిని మార్చకోనున్నాడు. బుధుడు ఏదైనా ఒక రాశిలో 28 రోజులు ఉండి.. అనంతరం మరో రాశిలోకి అడుగు పెడతాడు.

బుధుడు రాశిని మార్చుకునే సమయంలో వ్యాపార రంగంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. బుధుడు అంగారక రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు రాశి మారడం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

బుధుడు రాశిచక్రం ఎప్పుడు మార్చుకోనున్నాడంటే బుధ గ్రహం గ్రహాలకు యువరాజు. బుధుడు వ్యాపారం, ప్రసంగం, గణితం, తర్కాలకు కారకంగా పరిగణించబడుతున్నాడు. మార్చి 31, 2023న మధ్యాహ్నం 2.44 గంటలకు బుధుడు ..మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు జూన్ 7 వరకు ఈ రాశిలో ఉంటాడు. అనంతరం బుధుడు శుక్రుని రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇవి కూడా చదవండి

మేష రాశి  ఈ రాశిలో బుధుడు సంచారం రాశివారి జాతకంలో మొదటి ఇంట్లో జరగబోతోంది. దీంతో వీరికి అన్ని విధాలా అదృష్టం సొంతమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి.. రాబోయే సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి  మంచి ఆఫర్లు లభిస్తాయి. వీరి గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బులు పెట్టిన పెట్టుబడి నుండి మంచి రాబడినిస్తుంది.

మిధున రాశి ఈ రాశిలో పదకొండవ ఇంట్లో మిథున రాశి సంచారం జరగబోతోంది. జాతకంలో 11 వ ఇల్లు ఆనందం, సంపదగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశివారికి భారీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. వ్యాపారంలో ఈ రాశివారు వేసుకున్న ప్రణాళిక ఇప్పటి నుండి విజయవంతమవుతుంది. ఉద్యోగస్తులు మంచి ఆఫర్లను పొందే అవకాశము ఉంది.

కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బుధ సంచారం ఒక వరంవంటిదే.. మేషరాశిలో బుధ సంచారం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు పొందుతారు.. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారు. వ్యాపార సంబంధమైన వారికి మంచి అవకాశాలు వస్తాయి. పనిలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి  సింహ రాశిలో బుధుడు 9వ స్థానంలో సంచరించనున్నాడు. జాతకంలో తొమ్మిదవ స్థానం మతం, ప్రయాణానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశి వ్యక్తులు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణించవచ్చు. దీనిలో మీరు మంచి డీల్ పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది.

మీన రాశి ఈ రాశి వారికి బుధ సంచారము చాలా మేలు జరగనుంది. మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభానికి మంచి సంకేతాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి రాబోయే కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)