Srisailam: శ్రీశైల దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం.. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం

ఏపీలో రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శ్రీశైలం దేవస్థానానికి చెందిన 5300 ఎకరాల అటవీశాఖ భూములతో చాలా కాలంగా ఇబ్బందులున్నాయి.

Srisailam: శ్రీశైల దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం.. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం
Srisailam Temple
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2023 | 6:27 AM

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. గత కొన్నేళ్లుగా  శ్రీశైలం దేవస్థానం సరిహద్దు వివాదం కొనాగుతోంది. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం చూపింది ఏపీ ప్రభుత్వం. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది. రెవిన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష నిర్వహించి, మూడు శాఖల సమన్వయంతో సరిహద్దులు నిర్ణయించింది. 4430 ఎకరాల భూమికి బౌండరీ ఫిక్స్ చేసే దిశగా ముందుకెళ్తున్నామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సరిహద్దులపై ఎంవోయూ కుదుర్చుకున్నామని చెప్పారు. శ్రీశైల దేవస్థానం, దేవాదాయశాఖ చరిత్రలో ఇక సువర్ణాధ్యాయం మొదలవుతోందన్న మంత్రి. ఏపీలో రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.

శ్రీశైలం దేవస్థానానికి చెందిన 5300 ఎకరాల అటవీశాఖ భూములతో చాలా కాలంగా ఇబ్బందులున్నాయి. దశాబ్ధాల కల నెరవేరింది. ఎవరూ పరిష్కరించలేని సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. మాఢవీధుల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..