Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళ స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

తిరుమల శ్రీవారి జూన్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి సహస్రదీపాలకార టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. నకిలీ వెబ్ సైట్లతో మోసపోకుండా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళ స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Srivari Temple
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 23, 2023 | 7:48 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనున్నారు. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. జూన్ నెల కోటాను మార్చి 23న అంటే ఇవాళ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు ఉంటాయి. అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియాను మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా యాప్ ద్వారా భక్తులు టికెట్లను పొందే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది.

ఇదిలావుంటే, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో పెట్టనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

మరోవైపు, తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

నకిలీ వెబ్ సైట్లతో మోసపోకుండా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు  సూచిస్తున్నారు. టీటీడీ టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో ముందుగా మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి. ఆ తర్వాత జనరేట్‌ ఓటీపీపై క్లిక్ చేయండి. ఇక ఓటీపీని ఎంటర్ చేస్తే… టికెట్ బుక్‌ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్‌ ఓపెన్‌ అవుతుంది. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అంతే మీకు దర్శన టికెట్ల ఈజీగా బుక్ అవుతుంది.

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం

పన్ను ఆదా చేసే ఈ ఐదు పోస్టాఫీసు పథకాల గురించి మీకు తెలుసా..?
పన్ను ఆదా చేసే ఈ ఐదు పోస్టాఫీసు పథకాల గురించి మీకు తెలుసా..?
గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్..
గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..