ఆలయంలో అడుగడునా పాములు.. అమ్మవారి రూపంలో దర్శనం.. పోటెత్తిన భక్తులు
Kondalamma Jathara: ప్రతి ఆలయంలో భగవంతుడి విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్. కొండాలమ్మ ఆలయంలో పాములా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.
ప్రతి ఆలయంలో భగవంతుడి విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్. కొండాలమ్మ ఆలయంలో పాములా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది ప్రతి ఏటా ఇది జరుగుతూనే ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 4 రోజుల పాటు ఉగాది పర్వదినాన ఘనంగా జరిగే కొండలమ్మా జాతర వైభవంగా జరుగుతుంది. గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి అద్భుత కట్టడం శ్రీ కొండలమ్మ అమ్మ వారి ఆలయం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది.
కాకతీయుల కాలంలో ముగ్గురు అక్కాచెల్లెల్ల పేరుతో కొండలమ్మ చెరువు, గారమ్మ చెరువు, బాయమ్మ చెరువు ఇలా ముగ్గురి పేర్లతో.. మూడు చెరువులను పినిరెడ్డిగూడెంలో నిర్మించారు. కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. ఉగాది పర్వదినం నుంచి 4 రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర ప్రారంభం రోజు ఎడ్ల బండ్ల ప్రబలతో గుడి చుట్టు ప్రదర్శనలు చేస్తారు. ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎప్పటిలానే ఈసారి కూడా అమ్మవారు పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. అమ్మవార్లను దర్శించుకున్నారు. కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి ఆలయంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెలుతాయో ఎవరికీ తెలియదని భక్తులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..