Sri Rama Navami: శ్రీరామ నవమికి అత్యంత ప్రాధాన్యత.. అనేక యోగాల కలయిక.. ఈ 3 రాశులకు మహర్దశ.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు పుష్య యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా రామ నవమి రోజున ఏర్పడుతున్నాయి. రామ నవమి రోజంతా రవియోగం ఉంటుంది. ఈ యోగం కూడా శుభప్రదం. శ్రీరాముని ఆరాధనకు ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Sri Rama Navami: శ్రీరామ నవమికి అత్యంత ప్రాధాన్యత.. అనేక యోగాల కలయిక.. ఈ 3 రాశులకు మహర్దశ.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..
Horoscope Of Lord Rama
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2023 | 10:07 AM

సనాతన ధర్మ దృక్కోణంలో చైత్ర మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి  ప్రారంభమవుతుంది. చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రుల్లో చివరి రోజు అంటే శుక్ల పక్ష నవమిని శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసంలో శుక్ల పక్ష నవమి నాడు జన్మించాడు.

ఈ ఏడాది చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమి తిథి మార్చి 30న వచ్చింది. ఈ సంవత్సరం రామ నవమి నాడు, గ్రహాలు, రాశుల స్థానం కారణంగా అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే రామ నవమి పండుగకు మరింత ప్రత్యేకత ఉంది. కనుక ఈ రోజున ఏ శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఏ రాశులపై ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

రామ నవమి 2023  శుభ యోగం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు పుష్య యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా రామ నవమి రోజున ఏర్పడుతున్నాయి. మార్చి 30న ఉదయం 6.06 గంటల నుంచి 10.59 గంటల వరకు సర్వార్థసిద్ధి, అమృత సిద్ధి యోగం నిర్వహిస్తారు. ఆ తర్వాత మార్చి 31వ తేదీ రాత్రి 10.59 గంటల నుంచి ఉదయం 6.04 గంటల వరకు అమృతసిద్ధి యోగం, గురు పుష్య, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. రామనవమి రోజంతా రవియోగం ఉంటుంది. ఈ యోగం కూడా శుభప్రదం. శ్రీరాముని ఆరాధనకు ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

గురువారం శ్రీరాముడు స్థితి కారకుడు శ్రీ విష్ణువు 7వ అవతారం. విష్ణువును పూజించడానికి గురువారం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈసారి రామనవమిని గురువారం వచ్చింది. దీంతో రామ నవమికి ​​మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ రాశుల వారికి లాభాలు..

మేషరాశి ఈ రాశి వారికి సర్వత్రా ఆనందం . శ్రీరాముని అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. అప్పులను తీరుస్తారు. కొత్త ఆదాయ వనరుల మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో లాభాలు ఉంటాయి.

వృషభరాశి చైత్రరామ నవమి రోజు ఈ రాశి వారికి మంచిది. కొత్త పని, పెట్టుబడులకు ఈ రోజు మంచిది. నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు.  దీనితో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. గర్భిణీ స్త్రీలు పిల్లల ఆరోగ్యం కోసం శ్రీరాముడిని స్తుతించాలి.

తుల రాశి వారికి రామ నవమి నాడు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. ఆదాయ మార్గాలను పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)