Vastu Tips: మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం మొదలయ్యిందా? అయితే ఈ సంకేతాలు ముందే కనిపించడం ఖాయం..
డబ్బు అందరికీ ముఖ్యమే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా డబ్బుతోనే నడుస్తోంది. ఏ పని చేయలన్నా డబ్బు కావాల్సిందే. చివరికి రక్తసంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడ్డాయంటే డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో అర్థమౌతోంది.
డబ్బు అందరికీ ముఖ్యమే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా డబ్బుతోనే నడుస్తోంది. ఏ పని చేయలన్నా డబ్బు కావాల్సిందే. చివరికి రక్తసంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడ్డాయంటే డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో అర్థమౌతోంది. అయితే డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ కొందరి దగ్గరమాత్రమే నిల్వ ఉంటుంది. అందుకే దేనికైసనా అదృష్టం ఉండాలంటుంటారు. కొంతమంది ఎంత సంపాదించినా చివరి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మరి ఆ అదృష్టం మన తలుపు తడుతే ఎలా ఉంటుంది. మన జీవితమే మారిపోతుంది. అదృష్టం మన తలుపుతడుతుందనే సంకేతాలు ఏలా ఉంటాయి? తెలుసుకుందాం.
లక్ష్మీదేవిని ప్రతిఒక్కరూ పూజిస్తారు. హిందూవుల ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంంటారు. అంతేకాదు స్త్రీలను లక్ష్మీదేవితో పోల్చుతారు. శుక్రవారం పూట ఇంటిని శుభ్రం చేసుుకంటే సాక్ష్యాత్తు లక్ష్మీదేవి నట్టింట్లోకి అడుగుపెడుతుందని నమ్ముతుంటారు. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని చెబుతుంటారు. అందుకే హిందువులు ప్రతిరోజూ ఇల్లుతోపాటు వాకిలిని కూడా శుభ్రంగా ఉంచుతారు. వాకిట్లో ముగ్గులు పెడుతుంటారు. ఇంట్లోని పూజాగదిలో నిత్య దీపారధన చేస్తుంటారు. ఏఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం. అంతేకాదు ఇంట్లో గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఉంటే అలాంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.
కోకిల కూత :
ఇంటి ముందు కోకిల కూస్తుదంటే అది ధనానికి సూచికగా చెబుతుంటారు. అంతేకాదు కోకి కూసే దిశ ఆధారంగా శుభం, అశుభాలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయం వైపు కోకిల కూత కూస్తే నష్టం జరుగుతుందని…సాయంత్రం వినిపిస్తే శుభం జరుగుతుందని నమ్మకం. మధ్యాహ్నం వినిపించినా శుభం జరుగుతుంది. ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు కోకిల శబ్దం వినపడితే లాభాలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. మామిడి చెట్టుమీద కోకిల కూస్తుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతుంటారు.
చీమలు తిరిగితే :
ఇంట్లో ఎర్ర చీమలు తరచుగా కనిపిస్తుంటాయి కానీ నల్ల చీమలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయి. నల్ల చీమలు తిరుగుతుంటే మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. నోటితో భియ్యం మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచి జరుగుతుందని నమ్మకం. బియ్యంకు సంపదకు ముడిపడి ఉంటుందని కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమట. అయితే ఎర్ర చీమలు తిరుగుతుంటే మాత్రం అప్పులు పెరుగుతాయని నమ్ముతుంటారు.
బల్లి పడితే :
బల్లి మీదపడితే అశుభంగా భావిస్తారు. కానీ కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శాస్త్రం ప్రకారం.. కుడి చేతి పై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే.. త్వరలోనే లక్షాధికారి అవుతునడానికి సంకేతం.
రెండు తలల పాము కనిపిస్తే :
పాము అనగానే జంకుతాం. అలాంటి ఇంట్లో పాము కనిపిస్తే ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతుంటాయి. కానీ పాములను శుభసూచికగా కొంతమంది నమ్ముతుంటారు. రెండు తలల పాము ఇంట్లో కనిపించినట్లయితే అది లక్ష్మీదేవి కటాక్షానికి చిహ్నం.
కుటుంబంలో మార్పులు :
మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేముందు మీ ఆలోచనలలో మార్పులు కనిపిస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష, అసూయ, కోపం వంటివి ఉండవు. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగడంతోపాటు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. భార్య భర్తల మధ్య కలహాలకి తావుండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి సంతోషంగా ఉన్నారంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లుగానే భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..