TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. రూ. 300 దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఎప్పుడంటే..

తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను..

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. రూ. 300 దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఎప్పుడంటే..
Tirumala
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2023 | 3:07 PM

తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను ఈనెల 27వ తేదీన (ఎల్లుండి) విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టికెట్లను బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టికెట్లు వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్‌ చేసుకోవాలనుకునే భక్తులు మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే మార్చి 24వ తేదీన ఉదయం పది గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలైన విషయం తెలిసిందే. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..