Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు అప్పటి నుంచే.! వివరాలు ఇవే..
అటు ఏపీలో మాత్రం ఇంకా ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..
తెలంగాణలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. రాష్ట్రమంతటా హాఫ్ డే స్కూల్స్ మార్చి 15 నుంచి ప్రారంభం కావడమే కాదు.. ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఉండనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే అటు ఏపీలో మాత్రం ఇంకా ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ.. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. అలాగే ఆ తర్వాత పరీక్షల ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించనుండటంతో ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అనధికారికంగా సమాచారం ఇచ్చారు. ఇక 2023-24 విద్యాసంవత్సరానికి గానూ స్కూల్స్ జూన్ 12 నుంచి తిరిగి పున: ప్రారంభం కానున్నాయి. అలాగే 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనుండగా.. ఆ వెంటనే టెన్త్ విద్యార్ధులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..