Andhra Pradesh: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ? వైసీపీ నేతలన్నట్లు అక్కడే ఉన్నారా?
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో ఆమెకు తాడికొండ టికెట్ టీడీపీ ఇస్తుందా? డబ్బుకు ఆశపడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో ఆమెకు తాడికొండ టికెట్ టీడీపీ ఇస్తుందా? డబ్బుకు ఆశపడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. శ్రీదేవిని తప్పుబడుతూ నియోజకవర్గంలో అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. గుంటూరులోని శ్రీదేవి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి ఆమె దిష్టిబొమ్మలు తగులబెట్టారు.
ఇంత జరిగినా శ్రీదేవి ఎక్కడా బయటకు వచ్చిన వివరణ ఇవ్వలేదు. మార్చి 24న జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోందని వైసీపీ నేతలంటున్నారు. టీడీపీకి ఓటేసి ఉండకపోతే ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు ఖండించేవారు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తమ పార్టీలో డబ్బుకు అమ్ముడుపోయిన వారందరూ వెళ్లిపోయారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. డబ్బుకు ఆశపడే ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని అన్నారు. శ్రీదేవికి ఇంకేమైనా ఇస్తా కాని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని నారాయణస్వామి వెల్లడించారు.
తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి రోల్ ఎలా ఉండబోతున్నదనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఉండవల్లి శ్రీదేవి విషయంలో టీడీపీ నేతలు కూడా మౌనంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ లేదని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. మొత్తానికి శ్రీదేవి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి ఉత్కంఠభరితంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..