Horoscope Today ( March 24): ఆ రాశివారికి పెళ్లి సంబంధం కుదరవచ్చు.. శుక్రవారంనాడు 12 రాశులవారికి రాశిఫలాలు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Venkata Chari

Updated on: Mar 24, 2023 | 5:28 AM

Horoscope Today (24 March 2023): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. 12 రాశుల వారికి శుక్రవారం (మార్చి 24) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today ( March 24): ఆ రాశివారికి పెళ్లి సంబంధం కుదరవచ్చు.. శుక్రవారంనాడు 12 రాశులవారికి రాశిఫలాలు
Horoscope
Image Credit source: TV9 Telugu
Follow us

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థికపరంగా శుభయోగాలు కనిపిస్తున్నాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. పిల్లలు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

వృత్తి వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఒక పట్టాన సహాయం లభించదు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కానీ దుబారా ఎక్కువగా ఉంటుంది. తనకు మాలిన ధర్మం ఉపయోగపడదని గ్రహించండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పట్లో ఉద్యోగం మారే అవకాశం లేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులకు సహాయం చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా జీవితం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆర్థిక పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దగ్గర బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులతో మంచి కాలక్షేపం చేస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రేమించిన వ్యక్తి తోనే వివాహం నిశ్చయం అవుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంది. రుణ సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. చదువుల్లో పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న వారితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సహచరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.  ఆర్థికంగా ఇతరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం ఎక్కువవుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా రాబడి బాగానే ఉంటుంది. ఖర్చుల్ని అదుపు తీసుకోవాల్సి ఉంది. ఆరోగ్యం పరవాలేదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలక్షేపం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గర బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్దానాలు చేయవద్దు. వ్యక్తిగత ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

మంచి ఉద్యోగం లోకి మారే అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. మీ నుంచి గతంలో సహాయం పొందిన వారు మీకు అండగా నిలుస్తారు. స్థాన  చలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితులలో అనుకూలమైన మార్పు వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం ఒకటి వాయిదా పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu