Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Chandala Yoga: ఏప్రిల్ 22 న గురు చండాల యోగం.. ఈ రాశివారికి అన్నీ కష్టాలు.. నష్టాలే.. జర జాగ్రత్త..!!

ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే ఉన్న రాహువుతో గురువు కలవడంతో.. గురు-చండాల యోగం ఏర్పడుతుంది. బృహస్పతి అస్తమించినప్పుడు కొన్ని రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Guru Chandala Yoga: ఏప్రిల్ 22 న గురు చండాల యోగం.. ఈ రాశివారికి అన్నీ కష్టాలు.. నష్టాలే.. జర జాగ్రత్త..!!
Guru Rahu Yuti 2023
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2023 | 10:57 AM

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా దాని శుభ లేదా అ శుభ ప్రభావం ఖచ్చితంగా స్థానికులందరిపై పడుతుంది. గ్రహాల ప్రభావం వ్యక్తుల జాతకంపై ప్రభావం చూపిస్తుంది. ప్రజల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో.. బృహస్పతి గ్రహం త్వరలో అస్తమించబోతోంది. బృహస్పతి అస్తమించడం శుభప్రదంగా పరిగణించబడదు. బృహస్పతి అస్తమించినప్పుడు అన్ని రకాల శుభకార్యాలు ఆగిపోతాయి. జ్యోతిష్యంలో గురువుకు విశేష ప్రాధాన్యత ఉంది. గురుడు మార్చి 31న మీనరాశిలో అస్తమిస్తాడు. ఈ స్థితిలో ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేష రాశిలో మొదట రాహువు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 22వ తేదీన మేషరాశి లోకి గురువు ప్రవేశిస్తాడు. మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ గురు చండాల యోగంలో కొన్ని రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిథున రాశి మిథున రాశి వారు బృహస్పతి అస్తమించిన వెంటనే మరింత జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి అస్తమయం మిథున రాశికి చెందిన వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ రాశివారు డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం క్షీనిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వీటిని మీరు అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.

ధనుస్సు రాశి బృహస్పతి అస్తమించే సమంయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ధన నష్టం వల్ల అనేక  సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి..  చిన్న ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

కన్య రాశి బృహస్పతి  అస్తమయం ఈ రాశివారికి అనేక సమస్యలకు కారణంగా మారుతుంది. ఉద్యోగస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో ఏదో ఒక విషయంలో సీనియర్ అధికారులతో తగాదాలు రావచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువ. న్యాయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి బృహస్పతి ఉచ్చ స్థితికి చేరుకునే వరకూ ఈ రాశివారు మానసికంగా, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ విషయాలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబంలో మీ మాటలను విస్మరించడం వల్ల మీరు బాధపడతారు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)