AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit 2023: మిథునంలో కుజగ్రహం.. మే వరకు ఈ 4 రాశులవారికి తీరని కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా..?

సంచార ప్రభావాలు మనలో కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ నెల రెండో వారంలో కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. వృశ్చిక రాశి, మేష రాశికి అధిపతిగా

Mars Transit 2023: మిథునంలో కుజగ్రహం.. మే వరకు ఈ 4 రాశులవారికి తీరని కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా..?
Mars Transit In Gemini
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 27, 2023 | 7:20 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలోని ప్రతి గ్రహ సంచారం మానవాళీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో ఈ గ్రహ సంచార ప్రభావాలు మనలో కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ నెల రెండో వారంలో(మార్చ్ 13) కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. వృశ్చిక రాశి, మేష రాశికి అధిపతిగా పేర్కొనే కుజుడు మే 10 వరకు కూడా అదే రాశిలో ఉంటాడు. శక్తికి, ధైర్యానికి కారకుడైన కుజుడు రాశి మనందరిపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే మిథున రాశిలో కుజ గ్రహ సంచారం రాశిచక్రంలోని కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. కానీ మగిలిన రాశులకు కష్టాలను కొని తెస్తుంది. అంతేకాక ఈ సమయంలో ఆయా రాశులవారికి ఆకస్మిక కష్టాలు, అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. మరి ఆ రాశులేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

మిథునంలో మంగళ గ్రహ గోచారం ఈ 4 రాశులకు అశుభం..

కర్కాటక రాశి: కర్కాటక రాశి 12వ పాదంలో  కుజ గ్రహ సంచారం ఏర్పడుతుంది. దీంతో ఈ సమయం ఈ రాశులవారికి చాలా కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు తమ కెరీర్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంకా వీరికి ఇష్టం లేకపోయినా ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి కుజుడు 8వ పాదంలో సంచరిస్తాడు. ఫలితంగా ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు ఈ సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది.  మీకు ఈ కాలం అస్సలు కలిసిరాదు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: కుజ గ్రహ సంచారం ధనుస్సు రాశి 7వ పాదంలో జరుగుతుంది. ఫలితంగా మీరు ఈ సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. మీరు ఏకాగ్రతతో పనిచేస్తే మాత్రమే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.

కుంభ రాశి: కుంభరాశి 5వ పాదంలో కుజగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో మీకు సంతానం కలగదు. మీరు కెరీర్‌లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు అనవసర ప్రయాణాలు చేయడం మానుకోవాలి.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి