Dog Bite: యజమానిపైనే పెంపుడు కుక్క ఎటాక్‌.. నూటయాభై సార్లు కొరికేసిన శునకం… ఈ జాతి కుక్కలు డేంజర్ అంటున్న డాగ్ ట్రైనర్స్‌

మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందా!. అయితే జాగ్రత్త!. మేం అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న కుక్క మాపైనే ఎందుకు దాడి చేస్తుందని లైట్‌ తీస్కోకండి. ఎందుకంటే, అనంతపురం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్‌ చూస్తే మీకే అర్ధమవుతుంది. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో!.

Dog Bite: యజమానిపైనే పెంపుడు కుక్క ఎటాక్‌.. నూటయాభై సార్లు కొరికేసిన శునకం... ఈ జాతి కుక్కలు డేంజర్ అంటున్న డాగ్ ట్రైనర్స్‌
Rottweiler Dog
Follow us

|

Updated on: Mar 27, 2023 | 7:04 AM

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్‌ డాగ్స్‌ దడపుట్టిస్తున్నాయ్‌. దొరికినోళ్లను దొరికినట్టు పిక్కలు దొరకపట్టిమరీ కసితీరా కొరికేస్తున్నాయ్‌. అయితే, అనంతపురం జిల్లా గుంతకల్లులో ఊహించని ఇన్సిడెంట్‌ జరిగింది. ఇప్పటివరకూ వీధి కుక్కలే పిచ్చిపట్టినట్టుగా దాడిచేసి కండలు పీకేస్తున్నాయనుకుంటే… మేమేం తక్కువ తిన్నామా అంటూ ఓ పెంపుడు కుక్క ఏకంగా యజమానిపైనే ఎటాక్‌ చేసింది. వీధి కుక్కలైనా అక్కడక్కడా కరిచి వదిలేస్తాయేమో, కానీ ఈ పెంపుడు కుక్క మాత్రం ఏకంగా నూటయాభైసార్లు కసితీరా కొరికేసింది. జస్ట్‌మిస్‌ అంతే, లేకపోతే స్పాట్‌ డెడ్‌ అయ్యుండేవాడే!

నాలుగేళ్లుగా ప్రాణానికి ప్రాణంలా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. దానికి మురిపెంగా లక్కీ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఎప్పటిలాగే తలపై నిమరడానికి ప్రయత్నించాడు యజమాని నాగరాజు. మరి, ఏమైందోఏమో అమాంతం దాడి చేసింది. గొంతు పట్టుకుని కొరికేందుకు ప్రయత్నించింది. దాదాపు 15 నిమిషాలపాటు దాడిచేసి దొరికినచోటల్లా కసితీరా కరిచిపారేసింది. దాంతో, దెబ్బకు ఆస్పత్రి బెడ్‌ ఎక్కాల్సి వచ్చింది ఆ కుక్క యజమాని.

నాగరాజు పెంచుకుంటోన్న డాగ్‌… రాట్‌ వీలర్‌ జాతి. ఇవీ చాలా డేంజర్‌ అంటున్నారు డాగ్ ట్రైనర్స్‌. వీటికి కోపమొస్తే మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదమని, అమాంతం గొంతు పట్టుకుని కొరికేస్తాయని అంటున్నారు. ఈ కుక్కలను పెంచుకోకుండా చాలా దేశాలు బ్యాన్‌ కూడా చేశాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నాగరాజు అదృష్టం బాగుండి బతికి పోయాడుగాని లేదంటే కుక్క చేతిలో చచ్చిపోయుండేవాడు అంటున్నారు డాగ్‌ ట్రైనర్స్‌. ఇక, పెంపుడు కుక్క చేతిలో గాయాలపాలైన నాగరాజుకి 25 ఇంజక్షన్లు చేశారు వైద్యులు. ఇంత జరిగినా ఆ కుక్కను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు నాగరాజు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
టీవీ9తో ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ హైలెట్స్
టీవీ9తో ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ హైలెట్స్