Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోగొట్టుకున్న150 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు ఇచ్చిన పోలీసులు.. రూ.20 లక్షల విలువ ఉంటుందని అంచనా

మన జిల్లా, రాష్ట్రం, దేశంలోని కాకుండా కాకుండా ఇతర దేశాలలో నుంచి కూడా ఫోన్లు రికవరి చేశారు పోలీసులు. ఇలా శ్రీకాకుళంలో పోయిన ఫోన్ మలేషియాకు వెళ్లిపోగా దానిని గుర్తించి తిరిగి రికవరీ చేశారు.

Andhra Pradesh: పోగొట్టుకున్న150 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు ఇచ్చిన పోలీసులు.. రూ.20 లక్షల విలువ ఉంటుందని అంచనా
Police Recover Mobile Phones
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2023 | 9:40 AM

నేటి దైనందిని జీవితంలో ప్రతి పని మొబైల్ ఫోన్ తోనే ముడిపడి ఉంటుంది. అవతలి వ్యక్తికి కాల్ చేసి కేవలం మాట్లాడడానికి కాదు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు, పర్సనల్ డేటా స్టోరేజ్ ఇలా అన్ని మొబైల్ లోనే అయిపోతున్నాయి. అలాంటి మొబైల్ పోయిందంటే ఎవరికైనా ఇబ్బందే. అలా పోయిందనుకున్న రూ.20 లక్షల విలువ చేసే 150 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేసారు శ్రీకాకుళం జిల్లా సైబర్ సెల్ సిబ్బంది. వీటిల్లో మలేషియా నుంచి కూడా సెల్ ఫోన్ ని రికవరీ చేసి బాధితులకి అందజేసారు.

పోయిందనుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరికితే ఎలా ఉంటుంది. మన ఆనందానికి అవధులు ఉండవు కదూ…శ్రీకాకుళం జిల్లాలో అదే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు 20 లక్షల రూపాయిల విలువ చేసే 150 మొబైల్ ఫోన్ లను ఫోన్ లు పోగొట్టుకున్న సంబంధిత బాధితులకు అందజేసారు పోలిసులు. ఈ ఫోన్లు అన్నిటినీ శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెబ్ సైట్ లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వార పోయిన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని రికవరీ చేసారు. అలా రికవరీ చేసిన ఫోన్లను ఎవరి ఫోన్ వారికి బాధితులకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి .ఆర్. రాధిక అందజేసారు.జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు పోలీసు స్టేషన్లు కు వెళ్లే పనిలేకుండా జిల్లా ఐటి కోర్ టీమ్ రూపకల్పన చేసిన http://srikakulampolice.in/mobiletrackupload.html అధికార వెబ్సైట్ నందు పోగొట్టుకున్న ఫోన్ యొక్క సమాచారాన్ని బాధితులు రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది 150 ఫోన్లును గుర్తించి రికవరీ చేయగలిగింది.

కొట్టేసిన మొబైల్ ఫోన్లను కొంతమంది తక్కువ ధరలకు ఇతరులకు అమ్మి వేయడం జరిగింది. ఇలా మన జిల్లా, రాష్ట్రం, దేశంలోని కాకుండా కాకుండా ఇతర దేశాలలో నుంచి కూడా ఫోన్లు రికవరి చేశారు పోలీసులు. ఇలా శ్రీకాకుళంలో పోయిన ఫోన్ మలేషియాకు వెళ్లిపోగా దానిని గుర్తించి తిరిగి రికవరీ చేశారు. కావున మొబైల్ ఫోన్లు పోనట్లయితే తక్షణమే శ్రీకాకుళం జిల్లా మొబైల్ లాస్ట్ ట్రాకింగ్ సిస్టం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలోనే మీ ఫోన్లు రికవరి చేయడడానికి అవకాశం ఉంటుందని ఎస్పి తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో రూ.12.50 లక్షల విలువైన 130 మొబైల్ ఫోన్లను ఇలాగే రికవరీ చేసి పోలీసులు బాధితులకు అందజేసారు.ఇప్పటివరకు 2 విడతల్లో కలిపి రూ.32,50,000లు విలువగల మొత్తం 280 ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లో సెక్యూరిటీ లాకింగ్ లేకుండా ఎటువంటి విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఉంచారదని సూచించారు. క్రెడిట్ కార్డు, ఏటీఎం పిన్ నెంబర్లు,నెట్ బ్యాంకింగ్ అట్టి వాటికి భద్రత పరమైన లాకింగ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా వెసుకోవలన్నారు. మిగతా ఫోన్లు కూడా వీలైనంత త్వరగా రికవరీ చేసి బాధితులకు అందజేసేలా కృషి చేస్తామని ఎస్పీ అన్నారు. సరైన పత్రాలు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ iసూచించారు. అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందని వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా ఫోన్లు రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సిబ్బందిను జిల్లా ఎస్పీ అభినందించారు.

Reporter:- S.Srinivas

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..