Krishna District: ప్రియురాలు తన మాట వినలేదని.. యువతి ఇంటి వద్ద ప్రియుడు ఆత్మహత్యా యత్నం.. అంతకోపం ఎందుకో తెలిస్తే షాక్..

ప్రియుడు మనస్తాపం చెంది ఆమె ఇంట్లో దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు  ప్రియుడు. మరి ప్రియుడికి అంత కోపం తెప్పించింది తెలిస్తే.. ఆ యువకుడిని ఏమనాలో ఎవరికైనా అర్ధం కాదేమో.. 

Krishna District: ప్రియురాలు తన మాట వినలేదని.. యువతి ఇంటి వద్ద ప్రియుడు ఆత్మహత్యా యత్నం.. అంతకోపం ఎందుకో తెలిస్తే షాక్..
Lover Suicide Attempt
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2023 | 9:37 AM

కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన మాట వినలేదని మనస్థాపం చెందిన ప్రియుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఏకంగా ప్రియురాలి  ఇంటి వద్దనే  ప్రియుడి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన గుడివాడలోని చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి తన మాట లెక్క చేయక  పోవడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ప్రియురాలిమీద కోపంతో అర్థరాత్రి ఆమె ఇంటికి చేరుకుని ప్రియుడు మనస్తాపం చెంది ఆమె ఇంట్లో దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు  ప్రియుడు. మరి ప్రియుడికి అంత కోపం తెప్పించింది తెలిస్తే.. ఆ యువకుడిని ఏమనాలో ఎవరికైనా అర్ధం కాదేమో..

గుడివాడలోని నైజం పేటకు చెందిన శైలేష్ సింగ్  అనే యువకుడు తన ప్రియురాలికి స్కూటీపై తిరగవద్దని చెప్పాడు. అయితే ఆ యువతి శైలేష్ సింగ్ మాటలను లెక్క చేయకుండా.. హ్యాపీగా స్కూటీపై తిరుగుతూ ఉండేది. అది చూసి తన మాటను వినకుండా ప్రియురాలు స్కూటీపై తిరుగుతుందని భావించాడు. అది చూసి మనస్థాపంతో ప్రియురాలి ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు ప్రియుడు శైలేష్ సింగ్. ప్రియుడు శైలేష్ సింగ్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శైలేష్ సింగ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..