Bio Pic: ఏపీ రాబిన్‌హుడ్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర రవితేజ సినిమా.. పేదల పాలిట పెన్నిధి గురించి మీకు తెలుసా..!

ఫలితంగా.. నాగేశ్వర రావుకు స్పెషల్ గుర్తింపు దక్కింది. దొంగలలో ప్రసిద్ధి చెందాడు. ఎన్నోసార్లు టైగర్  పోలీసులతో ముఖాముఖికి తలపడ్డాడు.

Bio Pic: ఏపీ రాబిన్‌హుడ్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర రవితేజ సినిమా.. పేదల పాలిట పెన్నిధి గురించి మీకు తెలుసా..!
Tiger Nageswara rao
Follow us

|

Updated on: Mar 19, 2023 | 10:08 AM

ధనవంతులను దోచుకుని .. అలా దోచుకున్న సంపదను పేదలకు పంచిపెట్టే దోపిడీ దొంగలగురించి అనేక సినిమాలు చూసి ఉంటారు. అయితే నిజజీవితంలో కూడా అలాంటి మంచి దొంగ ఉండేవాడు. అతను ఆంధ్ర ప్రదేశ్‌లో రాబిన్‌హుడ్ అని పిలవబడే వాడు. స్టూవర్టుపురంలోని గోగ్రి నాగేశ్వరరావును టైగర్ అని పిలిచేవారు. డకాయిట్ టైగర్ నాగేశ్వర్ కథను వెండి తెరపైకి తీసుకొస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు పాత్రలో.. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు.

టైగర్ గోగ్రి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురంలో ప్రసిద్ధ దొంగ. అతనిపై అప్పట్లో చాలా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. దొంగల గ్రామంగా పేరొందిన స్టూవర్టుపురంలో టైగర్ పెరిగాడు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

దొంగల గ్రామంగా ఎలా మారిందంటే

1911 – 1914 మధ్య..  వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలకు పాల్పడిన దొంగలు,  డకాయిట్‌లను కలిసి ఉంచడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. బాపట్ల ప్రాంతంలో ఒక ప్రదేశానికి స్టూవర్టుపురం అని పేరు పెట్టారు. ఈ గ్రామం 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరు మీదుగా స్థాపించబడింది. దొంగలు, దోపిడీ దొంగలను ఒకే చోట ఉంచడం ద్వారా వారిపై నిఘా పెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

1970లో నాగేశ్వరరావు చిన్నతనంలో చిన్నచిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. క్రమంగా అతనిలో పోలీసులంటే భయం తొలగిపోయింది. దీంతో ఆ తర్వాత 15 ఏళ్లలో నిర్భయంగా పెద్ద దోపిడీలు చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో భారీ దోపిడీలకు పాల్పడేవాడు. అంతేకాదు చాకచక్యంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేవాడు. అందుకే అప్పట్లో     ప్రజలు అతన్ని టైగర్ అని పిలవడం ప్రారంభించారు.

అతను దోచుకున్నదంతా పేదలకు పంచేవాడు. నాగేశ్వర్ సోదరుడు ప్రభాకర్ రావు బీబీసీ కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేమిద్దరం స్టువర్ట్‌పురం ఇంట్లో నివసించాం. తన అన్న దోచుకున్న వస్తువులు,  డబ్బును పేదలకు పంచేవాడు. కనుక  ప్రజలు తన అన్నకు గట్టిగా మద్దతు ఇచ్చేవారని చెప్పాడు.

ఫలితంగా.. నాగేశ్వర రావుకు స్పెషల్ గుర్తింపు దక్కింది. దొంగలలో ప్రసిద్ధి చెందాడు. ఎన్నోసార్లు టైగర్  పోలీసులతో ముఖాముఖికి తలపడ్డాడు. అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చివరకు మార్చి 24, 1980న పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. దొంగ నాగేశ్వర రావు మరణానంతరం పోలీసులపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేశారు.

పోలీస్ స్టేషన్ ముందు బ్యాంకు దోపిడీ 1974లో నంద్యాల జిల్లా బనగానపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్మించిన బ్యాంకులోటైగర్ చోరీ చేసినట్లు  ప్రభాకర్ చెప్పాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ బ్యాంక్ దోపిడీ వార్త దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కింది. బ్యాంకులో 35 లక్షల రూపాయల దోపిడీ జరిగిందని టాక్ వినిపించింది.

ప్రభాకర్ మాట్లాడుతూ.. మా గ్యాంగ్‌లో 10 మంది సభ్యులున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా బ్యాంకు ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. బ్యాంకు వెనుక తలుపులు పగులగొట్టి డబ్బును శ్మశాన వాటికకు తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. మా వద్ద 14 కిలోల బంగారం, రూ.50 వేల నగదు ఉంది. విభజన జరగకముందే పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఈ పోలీసు దాడి నుండి నాగేశ్వర్ రావు తప్పించుకున్నాడు, కానీ నేను లొంగిపోయాను.

నాగేశ్వర్‌ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే తన అన్న మళ్లీ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టి.. పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

జైలు అధికారులపై దాడి చేసి పరారీ మేమిద్దరం 1976లో తమిళనాడులో అరెస్టయ్యామని, అయితే వేర్వేరు జైళ్లలో ఉంచారని  ప్రభాకర్ చెప్పారు. ఒక విచారణలో.. టైగర్ ఇకపై జైలులో ఉండలేనని చెప్పాడు. కాసేపటి తర్వాత జైలు అధికారులపై దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని నాకు పోలీసులు తెలియజేస్తూ.. మీ అన్న నిజంగా పులి అని పోలీసు అధికారులు చెప్పారు.

స్టూవర్ట్‌పురం సినిమాల్లో ఎంత వరకు కనిపిస్తుంది? దొంగల గ్రామంగా పిలిచే స్టూవర్టుపురంపై చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతోంది. వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కొనసాగుతోంది. చిత్ర యూనిట్ తన అన్న గురించి సమాచారం కోరిందని, అయితే చరిత్రను తప్పుగా చూపించడం తనకు ఇష్టం లేదని ప్రభాకర్ చెప్పారు.

ఇప్పుడు స్టూవర్ట్‌పురం గ్రామంలో మంచి వ్యక్తులు నివసిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోని చాలా మంది బయట నివాసం ఉంటున్నారు. స్టూవర్టుపురం పాత చిత్రాన్ని ప్రజలు మరిచిపోతున్నారు.

తమ గ్రామంపై సినిమా తీయడం ఆ గ్రామంలోని చాలా మందికి ఇష్టం లేదు. ఇలాంటి సినిమా వల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందని అంటున్నారు. ఇది వారిపైనా, ముందు తరాలపైనా ప్రభావం చూపుతుందని వారి అభిప్రాయం. అయితే సినిమాలో ఏం చూపిస్తారనేది చెప్పడం కష్టమని చెప్పారు

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..