Dasara Movie: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్.. ఈ పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా ?..

చమ్కీల అంగిలేసి ఓ వదినా.. సాంగ్. న్యాచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ కాంబోలో వస్తోన్న దసరా చిత్రంలోనిది ఈ పాట. ఇటీవల విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఆమె వాయిస్ నెటిజన్స్‏ను తెగ ఆకట్టుకుంటుంది.

Dasara Movie: సోషల్ మీడియాను ఊపేస్తోన్న 'చమ్కీల అంగిలేసి' సాంగ్.. ఈ పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా ?..
Singer Dhee
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2023 | 11:49 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సాంగ్ తెగ వైరలవుతుంది. ఎక్కడా చూసిన ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ పాటకు డాన్స్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ పాడిన సింగర్ వీడియోస్ సైతం నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసా ?.. అదేనండి.. చమ్కీల అంగిలేసి ఓ వదినా.. సాంగ్. న్యాచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ కాంబోలో వస్తోన్న దసరా చిత్రంలోనిది ఈ పాట. ఇటీవల విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఆమె వాయిస్ నెటిజన్స్‏ను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సాంగ్ పాడిన సింగర్ ఎవరా అని గూగుల్లో వెతుకేపనిలో పడ్డారు. అయితే ఈ పాటను ఇద్దరు సింగర్స్ పాడారు.

చమ్కీల అంగీలేసి ఓ వదినే.. చాకు లెక్కుండేటోడే ఓ వదినే.. కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే..

అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ పాడిన వారిలో మేల్ సింగర్ రామ్ మిరియాల కాగా.. ఫిమేల్ సింగర్ దీక్షిత అలియాస్ దీ. ఇండస్ట్రీలో చాలా పాటలు పాడుతున్నప్పటికీ చమ్కీల అంగిలేసి పాటతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది దీక్షత. తెలుగులో పాట పాడడం ఆమెకు ఇదే మొదటిసారి.

ఇవి కూడా చదవండి

గతంలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటించి ఆకాశమే నీ హద్దురా చిత్రంలో కాటుక కనులే పాట పాడింది దీక్షిత. ఈ సాంగ్ సైతం అప్పట్లో భారీ వ్యూస్‏తో దూసుకుపోయింది. అంతేకాదు.. అప్పట్లో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసిన రౌడీ బేబీ సాంగ్ పాడింది కూడా దీక్షితనే. 14 ఏళ్ల వయసు నుంచి పాటలు పాడడం ప్రారంభించింది దీక్షిత. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ కూతురే ఈ సింగర్ దీక్షిత. దసరా చిత్రానికి సంతోషన్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో తన కూతురితో ఈ సాంగ్ పాడించగా.. ప్రస్తుతం నెట్టింట సెన్సెషనల్ రెస్పాన్స్ వస్తోంది.

View this post on Instagram

A post shared by D H E E (@dhee___)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.