Ram Charan: ఆస్కార్ వేదికపై చరణ్, తారక్ డాన్స్ చేయకపోవడానికి కారణం అదే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

త‌న స్టాఫ్ మెంబ‌ర్స్ గురించి అక్కడ ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా, వారిని అందరికీ ప‌రిచ‌యం చేశారు. త‌న భార్య ఉపాస‌న కొణిదెల‌ను స్టేజ్ మీద‌కు ఆహ్వానించ‌డం అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. ఈ క్రమంలోనే ఆస్కార్ వేదికపై మనవాళ్లు డాన్స్ చేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

Ram Charan: ఆస్కార్ వేదికపై చరణ్, తారక్ డాన్స్ చేయకపోవడానికి కారణం అదే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2023 | 6:18 AM

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. RRR స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇండియన్ సినిమాకు ప్ర‌తినిధిగా తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇందులో త‌న కెరీర్ గురించి, నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డం గురించి మాట్లాడారు. నెపోటిజం గురించి త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మ‌రెన్నో విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు. అలాగే త‌న స్టాఫ్ మెంబ‌ర్స్ గురించి అక్కడ ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా, వారిని అందరికీ ప‌రిచ‌యం చేశారు. త‌న భార్య ఉపాస‌న కొణిదెల‌ను స్టేజ్ మీద‌కు ఆహ్వానించ‌డం అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు చరణ్. ఈ క్రమంలోనే ఆస్కార్ వేదికపై మనవాళ్లు డాన్స్ చేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో భారతీయ చిత్రాలు చరిత్ర సృష్టించాయి. ఉత్తమ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ కైవసం చేసుకోగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గెలిచింది. అయితే ఈ వేడుకలలో అమెరికన్ డ్యాన్సర్స్ నాటు నాటు పాటకు డాన్స్ చేయగా.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ ఫర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే నాటు నాటు పాటకు తారక్, రామ్ చరణ్ డాన్స్ చేయకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా అందుకు గల కారణాలను తెలిపారు చరణ్.

ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ.. “ఆస్కార్‌లో నాటు నాటు పాట‌కు నృత్యం చేయ‌డానికి నేను 100 శాతం సిద్ధంగానే ఉన్నాను. కానీ అక్క‌డేం జ‌రిగిందో నాకు నిజంగా తెలియ‌దు. అక్క‌డ పెర్ఫార్మ్ చేసిన‌వారు మాక‌న్నా చాలా బాగా చేశారు. భార‌త‌దేశానికి చెందిన పాట‌కు ఇంకెవ‌రో స్టేజ్ మీద నృత్యం చేస్తుంటే చూసి ఆనందించ‌డం మావంతైంది. నాటు నాటు మ‌న భార‌తీయ గీతం. మేము చాలా ఇంటర్వ్యూల కోసం నాటు నాటు పాటకు డాన్స్ చేసాము. ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.