Rana Daggubati: ‘నేను టెర్మినేటర్‌ని.. కుడి కన్ను అస్సలు కనిపించదు.. అంతేకాదు’.. శస్త్రచికిత్సలను మరోసారి గుర్తుచేసుకున్న రానా దగ్గుబాటి..
రానా.. తన కార్నియల్, కిడ్నీ మార్పిడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుడి కన్ను అస్సలు కనిపించదని.. తన పాక్షిక అంధత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పారు. తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పాన్ ఇండియా స్టా్ర్ హీరో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ తండ్రికొడుకులుగా నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. తన కార్నియల్, కిడ్నీ మార్పిడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుడి కన్ను అస్సలు కనిపించదని.. తన పాక్షిక అంధత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పారు. తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రానా మాట్లాడుతూ.. “కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడిన అతికొద్ది మందిలో నేను ఒకడిని. నేను నా కుడి కన్ను చూడలేను. కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. రెండింటికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయంలో నేను టెర్నినేటర్ని అనుకుంటున్నాను. చాలా మంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతుంటారు. కొన్నాళ్లకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయనా ఫీల్ అవుతూనే ఉంటారు. అలా కాకుండా ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందుకెళ్లాలి ” అంటూ చెప్పుకొచ్చారు.
2016లో మేము సైతం అనే కార్యక్రమంలో రానా తొలిసారిగా తన కంటి సమస్య గురించి బయటపెట్టాడు. ఈ ప్రోగ్రామ్‌లో ఓ చిన్నారి కథ విని చలించిన రానా.. తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు. తనకు కుడి కన్ను కనిపించదని.. చిన్నతనంలోనే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని.. ఆ సమయంలో వైద్యులు తనకు ఎంతో ధైర్యం చెప్పారని అన్నారు. జీవితంలో ఎదురయ్యే దుఃఖాలన్ని ఏదో ఒకరోజు దూరమవుతాయన… ఎప్పుడూ సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలని అన్నారు రానా.