AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: జక్కన్న చేతిలో ఆస్కార్ చూసి ఎన్టీఆర్ కంటతడి.. హైదరాబాద్ చేరుకున్న తారక్‏కు ఘన స్వాగతం..

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు.

Jr.NTR: జక్కన్న చేతిలో ఆస్కార్ చూసి ఎన్టీఆర్ కంటతడి.. హైదరాబాద్ చేరుకున్న తారక్‏కు ఘన స్వాగతం..
Jr. NTR
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 15, 2023 | 4:48 PM

Share

ఆస్కార్‌ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకున్న ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తమ అభిమాన హీరోకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. జై ఎన్టీఆర్‌ నినాదాలతో హోరెత్తించారు. తమకు ఈస్థాయిని కల్పించిన అభిమానులకు, ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్‌. తారక్‏తో పాటు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ సైతం నగరానికి చేరుకున్నారు. లాస్ ఏంజిల్స్ వేదికగా మార్చి 13న జరిగిన ఆస్కార్ అవార్డ్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ వేడుకలలో జక్కన్న దంపతులతోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.

గత కొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డ్స్ కోసం అమెరికాలో సందడి చేసిన తారక్.. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన తారక్.. ఆస్కార్‌ వేదికపై పెర్ఫార్మెన్స్‌ను జీవితంలో మరిచిపోలేనన్నారు. ఆస్కార్‌ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు ఎన్టీఆర్‌.

రాజమౌళి చేతిలో ఆస్కార్‌ చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని.. నాటు నాటు పాటకు అవార్డ్ అనౌన్స్‌ చేసినప్పుడు ఆనందాన్ని తట్టుకోలేకపోయామని అన్నారు. ఆస్కార్ వేదికపై ట్రిపుల్ ఆర్ టీంకు చేతికి అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించిందని చెప్పారు. అవార్డ్ వచ్చిన విషయం ముందుగా తన ఫ్యామిలీలో తన భార్యకు కాల్ చేసి షేర్ చేసుకున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాకు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు వెళ్లేందుకు తనకు వీసా రాలేదని.. కానీ రాజమౌళి చాలా ప్రయత్నం చేశారని చెప్పారు. కేవలం ఐదు రోజులకు మాత్రమే వీసా ఇచ్చారని.. దీంతో పదో తేదీన అమెరికా వెళ్లినట్లు చెప్పారు. స్టే్జ్ మీద నాటు నాటు పాటకు పెర్ఫామ్ చేయడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నారని ప్రేమ రక్షిత్ చెప్పారు. తాను కొరియోగ్రఫి చేసిన పాట, స్టెప్స్ ఆస్కార్ వేదికపై పెర్ఫామ్ చేస్తుంటే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.